Site icon NTV Telugu

Telangana High Court: ఆ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు..

High Court

High Court

Telangana High Court: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. 10 మంది BRS ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. స్పీకర్‌ నిర్ణయాన్ని బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్‌ చేసింది. దానం నాగేందర్‌, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్‌ గౌడ్, పోచారం, బండ్ల కృష్ణమహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావులపై పిటిషన్‌ దాఖలైంది.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది.. విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసింది.

READ MORE: Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..

మరోవైపు.. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఇటీవల హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్‌ తీర్పును కొట్టేయాలని పిటిషన్‌లో ఏలేటి కోరారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం.. కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేశారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన రోజు నుంచే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బిహార్‌లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

READ MORE: Iran US conflict: అమెరికా తనతో తానే చర్చలు జరుపుతోంది.. కాల్పుల విరమణ ప్రయత్నాలపై ఇరాన్ సైన్యం సెటైర్స్

Exit mobile version