Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాగల కొన్ని గంటల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మంచిర్యాల, నిర్మల్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.
Also Read
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్‌కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
రాజధాని హైదరాబాద్ నగరం విషయానికి వస్తే.. పగటిపూట ఆకాశం పాక్షికంగా మబ్బు పట్టి ఉండి, అక్కడక్కడ మోస్తరు చినుకులు పడే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత నగరంలో వాతావరణం పూర్తిగా మారిపోయి, పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఈదురుగాలులు వీచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది. దీనివల్ల సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్లాన్లను దానికి అనుగుణంగా మార్చుకోవాలని అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప సాయంత్రం పూట బయటకు రావద్దని, జీహెచ్ఎంసీ మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు ఇప్పటికే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయని తెలిపాయి.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్‌కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!