Compensation: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే..
- వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం..
- గత ఏడాది ఎక్స్ గ్రేషియా పెంచుతూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ..
- డెత్ సర్టిఫికేట్, పోస్ట్‌మార్టం, ఎఫ్.ఐ.ఆర్ రిపోర్టులు తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా సామాన్యులు, శ్రామికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జీవనోపాధి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేసే క్రమంలో చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఈ వడదెబ్బతో మరణించిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వారికిచ్చే ఎక్స్‌గ్రేషియాను గతేడాది పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ (SDMA) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ పరిహారం పొందేందుకు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన లేక చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి.
Also Read:TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఏం చేయాలి..?
వడదెబ్బ మరణాలను ధ్రువీకరించడానికి ప్రతి మండలంలో ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఇందులో తహసీల్దార్, వైద్యాధికారి, సబ్ ఇన్స్పెక్టర్ (SI) సభ్యులుగా ఉంటారు. మరణం సంభవించిన వెంటనే ఈ కమిటీకి సమాచారం అందించాల్సి ఉంటుంది.
వ్యక్తి వడదెబ్బతోనే మృతి చెందినట్లు తొలుత వైద్యాధికారి ధ్రువీకరించాలి. తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తారు. వడదెబ్బ మరణాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికి మృతదేహానికి తప్పనిసరిగా పోస్ట్‌మార్టం నిర్వహించాలి. ఈ నివేదిక పరిహారానికి అత్యంత కీలకంగా ఉంటుంది.
Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ సిద్ధం చేస్తారు. డెత్ సర్టిఫికేట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, ఎఫ్.ఐ.ఆర్, పంచనామా రిపోర్టులను జతచేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. మండల కమిటీ పంపిన నివేదికను ఆర్డీఓ (RDO) , జిల్లా కలెక్టర్ పరిశీలించి.. మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!