NTV Telugu Site icon

TG DSC 2024: గుడ్‌ న్యూస్.. నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు

Teacher

Teacher

TG DSC 2024: ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరనుంది. తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. మొత్తం 10,006 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై కొంత మందికి నియామక పత్రాలను స్వయంగా అందజేస్తారు. హైదరాబాద్‌ జిల్లా నుంచి 761 మంది అత్యధికంగా.. అత్యల్పంగా పెద్దపల్లి నుంచి 82 మంది కొత్త టీచర్లు నియామక పత్రాలను పొందనున్నారు. మొత్తం 11,062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల 1,056 స్పెషల్‌ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పూర్తిచేశారు. 2 గంటల లోపు ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరు ఎల్‌బీ స్టేడియంకు చేరేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

Read Also: TG DSC : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. ఫైనల్‌ లిస్ట్‌ విడుదల

జిల్లాల వారీగా జాబితా ఇదే..