తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిపై చర్యలు తీసుకునేందుకు సమయాత్తం అవుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్ వేసుకోని… వారికి ఫించన్ మరియు రేషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. నవంబర్ 1 వ తేదీ లోగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని..లేని యెడల… వ్యాక్సిన్ తీసుకోని కుటుంబాలపై వేటు వేసేందుకు అడుగులు వేస్తోంది టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై సీఎం కేసీఆర్ ఫైనల్ నిర్ణయం తీసుకున్న తర్వాత..ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 179 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందగా… ఇదే సమయంలో 104 మంది బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.