Site icon NTV Telugu

Indiramma Indlu : ఇక ప‌ట్టణాల్లోనూ ఇందిర‌మ్మ ఇండ్లు

Indiramma Housing App

Indiramma Housing App

Indiramma Indlu : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పట్ల ప్రత్యేక దృష్టితో పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, పేదలు నివసించే ప్రాంతాల్లో జీవనోపాధికి ఆటంకం లేకుండా జీ+3 మోడల్‌లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఆదివాసీలకు నివాస హక్కు కల్పించడమే కాకుండా, వారు జీవించేందుకు అవసరమైన వనరులను అందుబాటులో ఉంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప‌ట్టణాల్లోనూ ఇందిర‌మ్మ ఇండ్లు పథకం కార్యరూపం దాల్చనుంది.

REDMAGIC 10S Pro: మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో గేమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్ మేజిక్ 10S ప్రో లాంచ్..!

ఈ క్రమంలో గిరిజనులకు ప్రత్యేకంగా 22 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్టు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు ఐటిడిఎ పరిధిలోని చెంచు, కొలం, తోటి, కొండరెడ్ల గిరిజనుల కోసం 13,266 ఇండ్లను మంజూరు చేశారు.

అంతేకాక, రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు. మొత్తం కలిపి ఇప్పటివరకు గిరిజనులకు 22,016 ఇండ్లు మంజూరైనట్టు వెల్లడించారు. ఇందిరమ్మ హౌసింగ్ పథకం పునఃప్రారంభం ద్వారా గిరిజనులకు పెద్దఎత్తున లబ్ధి చేకూరనుంది. ఇది వారి స్థిర నివాస కలను నెరవేర్చడమే కాక, భవిష్యత్ తరాలకు బాగోతమైన భద్రతను కల్పించనున్నది.

YS Jagan: “అధైర్య పడొద్దు”.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన జగన్…

Exit mobile version