Site icon NTV Telugu

TG Govt: గుడ్‌న్యూస్.. డ‌యాల‌సిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు మంజూరు..

Tg Govt

Tg Govt

డ‌యాల‌సిస్ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మే మాసంలో 4021 మంది డ‌యాల‌సిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది. డ‌యాల‌సిస్ పేషెంట్లకు నెల‌కు రూ.2016 మంజూరు చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హ‌యంలో కేవ‌లం 4011 మందికి మాత్రమే డ‌యాల‌సిస్ పేషెంట్లకు ఆస‌రా పింఛన్ వచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఒక్క మే మాసంలోనే అంత‌కు మంచి పెన్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. మంత్రి సీత‌క్క చొర‌వ‌తో నూత‌న ల‌బ్ధిదారుల ఎంపిక‌ జరిగింది.

READ MORE: MP Mithun Reddy: జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి జీర్ణించుకోలేక పోతున్నారు.. అందుకే..!

మొద‌ట‌గా డయాల‌సిస్ పేషెంట్లకు పిన్షన్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. త్వరలో హెచ్ఐవీ పేషెంట్లకు కూడా అందించాలని నిర్ణయించింది. త‌మ‌కు పెన్షన్లు మంజూరు చేయాల‌ని ఇప్పటికే 13 వేల మంది హెచ్‌ఐవీ బాధితులు ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. త్వర‌లో అన్ని ర‌కాల నూత‌న పెన్షన్ దారుల‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమ‌తులు కోరింది. అనుమ‌తులు రాగానే నూత‌న పెన్షన్లు అందించనున్నారు. ఇప్పటికే పెన్షన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం నెల‌కు రూ.993 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది.

READ MORE: MP Mithun Reddy: జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి జీర్ణించుకోలేక పోతున్నారు.. అందుకే..!

Exit mobile version