ప్రధానమంత్రి కిసాన్ యోజన లాగే, ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన (PM-KISAN ) కూడా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చే భారత ప్రభుత్వ పథకం. ఈ పథకం వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. దేశానికి అన్నం పెట్టడానికి కష్టపడి పనిచేసే రైతులకు పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయ వనరు ఉండేలా చూడటం ఈ పథకం లక్ష్యం. ఇది నెలవారీ ఆదాయం ఒత్తిడి నుండి వారిని విముక్తి చేస్తుంది. వృద్ధాప్యం కోసం తక్కువ పొదుపు లేదా…
డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మే మాసంలో 4021 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది. డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2016 మంజూరు చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయంలో కేవలం 4011 మందికి మాత్రమే డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పింఛన్ వచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఒక్క మే మాసంలోనే అంతకు మంచి పెన్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. మంత్రి సీతక్క చొరవతో నూతన లబ్ధిదారుల ఎంపిక జరిగింది.