డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మే మాసంలో 4021 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది. డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2016 మంజూరు చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయంలో కేవలం 4011 మందికి మాత్రమే డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పింఛన్ వచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఒక్క మే మాసంలోనే అంతకు మంచి పెన్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. మంత్రి సీతక్క చొరవతో నూతన లబ్ధిదారుల ఎంపిక జరిగింది.