Site icon NTV Telugu

BC Reservations: సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

Supremecourt

Supremecourt

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అక్టోబర్ 9వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్‌ఎల్‌పీ పిటిషన్ వేసింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని పిటిషన్‌లో ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పేర్కొంది.

Also Read: Bandi Sanjay: సెకండ్ హ్యాండ్‌లో కూడా కారును కొనడానికి ఎవరూ లేరు.. కేటీఆర్‌కు బండి కౌంటర్!

పిటిషన్‌లోని అంశాలు ఇవే:
# రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవు

# సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది

# ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది

# స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంతమేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై సమగ్ర, శాస్త్రీయ అధ్యయనం తెలంగాణలో జరిగింది

# సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33 శాతం మంది బీసీలు

# రాహుల్ రమేశ్ వాఘ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది

# తమిళనాడు గవర్నర్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో ప్రస్తావించిన ప్రభుత్వం

# శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులకు మూడు నెలల్లోపు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే.. వాటికి ఆమోదముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. పై విషయాలను పరిగణలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.

Exit mobile version