తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అక్టోబర్ 9వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్‌ఎల్‌పీ పిటిషన్ వేసింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని పిటిషన్‌లో ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా…