Site icon NTV Telugu

Telangana Formation Day: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం

Kcr

Kcr

Telangana Formation Day: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆహ్వానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్‌ఛార్జ్‌ హర్కర వేణుగోపాల్ రావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో హర్కర వేణుగోపాల్‌ కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని వేణుగోపాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం హర్కర వేణుగోపాల్ నిన్నటి(గురువారం) నుంచి వేచి చూస్తున్నారు. కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌లో కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు హర్కర వేణుగోపాల్. ఫామ్ హౌజ్‌కు వద్దు.. హైదరాబాద్‌లో కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇప్పిస్తామని కేసీఆర్ ఆఫీస్ వర్గాలు చెప్పినట్లు తెలిసింది.

Read Also: Global Rice Summit: హైదరాబాద్‌లో ప్రపంచ వరి సదస్సు.. సన్నాహాలు ముమ్మరం

 

Exit mobile version