Site icon NTV Telugu

Big Breaking : తెలంగాణ వాసులకు బిగ్‌ న్యూస్‌.. ఇక నుంచి 24 గంటల దుకాణాలు ఓపెన్‌

Shops Open

Shops Open

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అన్ని వేళ్లలో షాప్‌లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్‌. తెలంగాణ వ్యాప్తంగా 24/7 షాపులకు తెరుచుకునేందుకు వీలు కల్పిస్తూ.. 24 గంటలూ షాపులు తెరిచేందుకు ఏడాదికి రూ.10వేలు అదనంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. ఉద్యోగులకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వానికి అందించాలని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా.. మహిళా ఉద్యోగుల అనుమతితోనే నైట్‌ షిఫ్ట్‌ వేయాలని, నైట్‌ షిఫ్ట్‌లలో పనిచేసే మహిళలకు వెహికల్‌ పిక్‌ఆప్‌ అండ్‌ డ్రాపింగ్‌, రాత్రి వేళలో పని చేసే మహిళా సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. సిబ్బందికి విధిగా ఐడీ కార్డులు జారీ చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. లేబర్‌ చట్టాల ప్రకారం పని గంటలు నిర్ణయించాలని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కాకుండా.. ఎక్కువ పని గంటలు పని చేసినవారికి ఓవర్‌ టైం డబ్బులు ఇవ్వాలని, వీక్‌ ఆఫ్‌లతో పాటు.. పండుగలకు సెలవులను ఇవ్వాలని పేర్కొంది.

Also Read : Gunmen Attacks: నరమేధం.. మార్కెట్‌లోకి ప్రవేశించి 47 మందిని కాల్చి చంపిన సాయుధులు

Exit mobile version