Site icon NTV Telugu

Telangana: ప్రజాపాలనా విజయోత్సవాలకు గవర్నర్, కేసీఆర్‌, కిషన్ రెడ్డికి ఆహ్వానం

Telangana

Telangana

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలనా విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్‌భవన్‌లో గవర్నర జిష్ణుదేవ్‌ వర్మను, దిల్‌కుషా అతిథిగృహంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని కలిసి ప్రజాపాలనా విజయోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రాలను అందజేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రి సమావేశమయ్యారు. గంట 15 నిమిషాల పాటు మాజీ సీఎం కేసీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య సమావేశం సాగింది. కేసీఆర్‌తో కలిసి మంత్రి లంచ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన వేడుకకి రావాలని ప్రభుత్వం తరపున కేసీఆర్‌కు మంత్రి పొన్నం, ప్రోటోకాల్ అధికారులు ఆహ్వానం అందించారు. మంత్రి వెంట అధికారులు, రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు.

Read Also: Gun Fire: బావ బావమరిదిల మధ్య వివాదం.. ఎయిర్‌గన్‌తో కాల్పులు

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం తరపున తాను, ప్రోటోకాల్ అధికారులు వచ్చామని తెలిపారు. తెలంగాణలో అందరిని గౌరవించాలి అనేది మా పార్టీ తీసుకున్న నిర్ణయమన్నారు. లంచ్ టైంలో వచ్చాము కాబట్టి కేసీఆర్ లంచ్ చేయమంటే చేశామన్నారు. ఈ భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. మేము అందరిని ఆహ్వానిస్తున్నాం కేసీఆర్ వస్తారా..? రారా..? అన్న నిర్ణయం పార్టీలో చర్చించి తీసుకుంటారననారు. వస్తారా.. రారా.. అనేది కేసీఆర్‌ ఇష్టమని మంత్రి స్పష్టం చేశారు.

 

Exit mobile version