NTV Telugu Site icon

Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు.. 24 గంటలు కావస్తున్నా..!

Girl Missing

Girl Missing

Jangaon Girl Missed in Ayodhya’s Saryu River: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోరం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన ఓ యువతి సరయూ నదిలో గల్లంతైంది. సోమవారం (జులై 19) నదిలో స్నానం చేస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది. నిన్నటి నుంచి రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టినా..యువతి ఆచూకీ లభించలేదు. యువతి గల్లంతయ్యి 24 గంటలు కావస్తుండటంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

జనగామ పట్టణానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం జులై 28న అయోధ్య రామ మందిరం దర్శనానికి వెళ్లింది. 29న దైవ దర్శనం కోసం కుటుంబ సమేతంగా సరయూ నదిలో స్నానాలు చేయడానికి వెళ్లారు. నాగరాజు కుటుంబానికి చెందిన ఐదుగురు యువతులు నదిలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. అప్రమత్తమై స్థానికులు నదిలోకి దూకి నలుగురిని కాపాడారు. తేజ శ్రీ అనే యువతి మిస్ అయింది. రెస్క్యూ టీమ్ నిన్నటి నుండి గాలింపు చర్యలు చేపట్టినా.. యువతి ఆచూకీ లభించలేదు.

Also Read: TS Crime News: సోదరుడిని హత్య చేసి.. మృతదేహాన్ని బైక్‌పై తరలించారు! చివరకు

తేజ శ్రీ గల్లంతయ్యి 24 గంటలు కావస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు యువతి కోసం గాలిస్తున్నామని తెలిపారు. తేజ శ్రీ జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Show comments