NTV Telugu Site icon

BJP MP K Laxman: విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది!

Dr K Laxman

Dr K Laxman

BJP MP Dr K Laxman Talks About Telangana Formation Day: తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) అని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిందని, పార్లమెంట్‌లో గళం విప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించిందని లక్షణ్ విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ కాదని.. తెచ్చుకున్నది తెలంగాణ సమాజం అని ఎంపీ లక్షణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఎంపీ లక్షణ్ మాట్లాడారు.

బీజేపీ ఎంపీ లక్షణ్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ ఉద్యమానికి ఏబీవీపీ నాంది పలికింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కాలరాసింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీఅనేక మందిని పొట్టనపెట్టుకుంది. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసింది, పార్లమెంట్‌లో గళం విప్పింది. కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించింది. యూపీఏ ప్రభుత్వం కళ్లుతెరవాలని శ్రీకాంత్ చారితో మొదలు పెడితే.. ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. 12 వందల మంది అమరులు అయ్యారు. వారి బలిదానాలతో తెలంగాణ వచ్చింది. బలిదేవత సోనియా గాంధీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి భక్తుడు అయ్యాడు’ అని అన్నారు.

Also Read: CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదు!

‘ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంని అనుభవిస్తుంది. ఏ విధంగా సలహాదారుగా ఉన్నావో అని కోదండ రామ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం, కోదండ రామ్ ప్రశ్నించకపోవడం, రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఉచిత గ్యారంటీలు ఓట్లు దందుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. సుష్మ స్వరాజ్ మీకు ఎందుకు గుర్తుకు రావడం లేదు. ఆమెను విస్మరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిపోతే.. ఈ సీఎం ఆ చిప్ప పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచుకోవడం కోసం రాజీపడుతున్నారు. పోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకో.. లేకుంటే నీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. 5 ఏళ్లు నీకు కష్టమే’ అని బీజేపీ ఎంపీ లక్షణ్ హెచ్చరించారు.