NTV Telugu Site icon

Telangana Exports: తెలంగాణకు సముద్ర తీరం లేకపోయినా..

Telangana Exports

Telangana Exports

Telangana Exports: వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. గడచిన రెండేళ్లలో వ్యవసాయ ఎగుమతులు దాదాపు 40 శాతం పెరిగాయి. 2020-21లో 6 వేల 337 కోట్ల రూపాయలుగా నమోదైన ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ.. 2021-22లో 10 వేల కోట్లు దాటడం విశేషం.

Corporate Connections: హైదరాబాద్‌లో హైలెవల్ క్లబ్. 100 కోట్ల టర్నోవర్ ఉంటేనే చోటు

ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2017-18లో.. అంటే.. ఐదేళ్ల కిందట వ్యవసాయ ఎగుమతుల విలువ 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. అవి ఇప్పుడు రెట్టింపు అయ్యాయి.

తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా పత్తి, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, కాఫీ, టీ మరియు మాంసం ఎగుమతి చేస్తోంది. సాగుకు సంబంధించి తెలంగాణ రైతులు సరికొత్త విధానాలను అవలంభిస్తుండటం, టెక్నాలజీని వాడుతుండటం, పంట దిగుబడుల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీ వసతులు ఉండటం చెప్పుకోదగ్గ అంశాలని నిపుణులు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరం లేకపోయినా అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించటం ద్వారా వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నిజామాబాద్‌కి చెందిన ఒక పండ్ల ఎగుమతిదారుడు పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2021-22వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 3 వేల 55 కోట్ల రూపాయల విలువైన పత్తి ఎగుమతులు జరిగాయి.

సుగంధ ద్రవ్యాలు, కాఫీ, టీ కలిపి వెయ్యీ 936 కోట్ల రూపాయల ఎక్స్‌పోర్ట్‌లు నమోదయ్యాయి. ధాన్యం ఎగుమతుల విలువ 14 వందల 80 కోట్లు, మాంసం ఎక్స్‌పోర్ట్‌ల వ్యాల్యూ 268 కోట్ల రూపాయలకు చేరింది. తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం, మొక్కజొన్న, నిమ్మ, ద్రాక్ష, మామిడి, సోయాబీన్ తదితర ఎగుమతులు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.