Telangana Exports: తెలంగాణకు సముద్ర తీరం లేకపోయినా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Exports: వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. గడచిన రెండేళ్లలో వ్యవసాయ ఎగుమతులు దాదాపు 40 శాతం పెరిగాయి. 2020-21లో 6 వేల 337 కోట్ల రూపాయలుగా నమోదైన ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ.. 2021-22లో 10 వేల కోట్లు దాటడం విశేషం.
Corporate Connections: హైదరాబాద్‌లో హైలెవల్ క్లబ్. 100 కోట్ల టర్నోవర్ ఉంటేనే చోటు
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2017-18లో.. అంటే.. ఐదేళ్ల కిందట వ్యవసాయ ఎగుమతుల విలువ 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. అవి ఇప్పుడు రెట్టింపు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా పత్తి, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, కాఫీ, టీ మరియు మాంసం ఎగుమతి చేస్తోంది. సాగుకు సంబంధించి తెలంగాణ రైతులు సరికొత్త విధానాలను అవలంభిస్తుండటం, టెక్నాలజీని వాడుతుండటం, పంట దిగుబడుల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీ వసతులు ఉండటం చెప్పుకోదగ్గ అంశాలని నిపుణులు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరం లేకపోయినా అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించటం ద్వారా వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నిజామాబాద్‌కి చెందిన ఒక పండ్ల ఎగుమతిదారుడు పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2021-22వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 3 వేల 55 కోట్ల రూపాయల విలువైన పత్తి ఎగుమతులు జరిగాయి.
సుగంధ ద్రవ్యాలు, కాఫీ, టీ కలిపి వెయ్యీ 936 కోట్ల రూపాయల ఎక్స్‌పోర్ట్‌లు నమోదయ్యాయి. ధాన్యం ఎగుమతుల విలువ 14 వందల 80 కోట్లు, మాంసం ఎక్స్‌పోర్ట్‌ల వ్యాల్యూ 268 కోట్ల రూపాయలకు చేరింది. తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం, మొక్కజొన్న, నిమ్మ, ద్రాక్ష, మామిడి, సోయాబీన్ తదితర ఎగుమతులు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!