Harish Rao Counters to Nirmala Sitharaman Comments: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందని బీఆర్‌ఎస్ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వంను ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టలేదనే తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలమ్మ స్వయంగా బయటపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వమనే విషయం కేంద్రమంత్రి వ్యాఖ్యలతో తేటతెల్లమైందని హరీశ్ రావు అన్నారు.
బుధవారం మంత్రి హరీశ్ రావు సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ… ‘మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఒత్తిడి చేసింది. లేదంటే రూ. 25 వేల కోట్లు ఇవ్వమని బ్లాక్ మెయిల్‌కు దిగింది. అయినా కూడా సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గకుండా.. రైతుల పక్షానే నిలిచారు. దేశంలో రైతు పక్షపాతి ఎవరైనా ఉంటే.. అది కేసీఆర్ మాత్రమే. కేంద్ర నిధులు రాకపోయినా పర్వాలేదు కానీ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సీఎం నిరాకరించారు’ అని గుర్తు చేశారు.
Also Read: Harish Rao: చివరకు రామక్క పాటని కూడా కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టింది: హరీష్ రావు
‘కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఈ రెండు పార్టీలు తెలంగాణ రైతులకు అన్యాయం చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టాయి. రాజస్థాన్‌లో మోటార్లకు మీటర్లు పెట్టారనే విషయం ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తారా?. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే.. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒప్పుకున్నట్లే. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారు. బీడీ కార్మికులకు 5 శాతం జీఎస్టీ పెంచింది బీజేపీ’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.