Telangana Egg Donation Scam : రూ.30 వేల ఆశ చూపించి.. 50 మంది యువతుల జీవితాలతో ఆటలు
- 50 మంది యువతులు బాధితులుగా గుర్తింపు
- ఉద్యోగాల పేరుతో అండాల సేకరణ
- ఆధార్ వివరాలు మార్చి హాస్టళ్లలో నిర్బంధం
- ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతున్న ఫెర్టిలిటీ సెంటర్ల అండాల విక్రయ దందాపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ దారుణ ఉదంతం మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉందని కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, అమాయక యువతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న అండాల దందా ముఠా , సంబంధిత ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు.
ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగాల పేరుతో గాలం
గర్భం దాల్చడం అనేది ఒక దేవుడి వరమని, అలాంటి పవిత్రమైన విషయాన్ని ఈ ముఠా కేవలం డబ్బు సంపాదనకే సాధనంగా మార్చుకుందని నేరెళ్ల శారద విమర్శించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద యువతులను టార్గెట్ చేస్తూ.. ఈవెంట్ మేనేజ్మెంట్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపారని తెలిపారు. ఇది చాలా తేలికైన మార్గమని నమ్మబలికి, కేవలం రూ. 30 వేల చొప్పున ఇస్తూ వారి నుంచి అండాలను అమ్ముకుంటున్నారని వెల్లడించారు. ఈ అక్రమ దందాలో ఇప్పటివరకు 50 మంది బాధితులను సేకరించగా, ఇందులో 6 రాష్ట్రాలకు చెందిన యువతులు ఉన్నారని తెలిపారు. అత్యంత ఘోరమైన విషయమేమిటంటే.. ఈ బాధితుల్లో 90 శాతం మంది పెళ్లి కాని యువతులే కావడం గమనార్హం.
Also Read
- PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
- Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
- Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
- Charminar Temple Rush: చార్మినార్‌లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
ఆధార్ కార్డుల మార్పిడి.. హాస్టళ్లలో బంధించి మోసం
గత 15 రోజులుగా ఈ యువతులను హాస్టళ్లలో ఉంచారని, కానీ వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మహిళా కమిషన్ నిర్ధారించింది. పట్టుబడకుండా ఉండేందుకు వారి ఆధార్ కార్డులలో పేర్లు, చిరునామాలను సైతం మార్చేసి ఒక తరాల వ్యవస్థనే మార్చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. చివరికి రెండు నెలల గర్భవతిగా ఉన్న ఒక చిన్నారికి కూడా ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి అబార్షన్ చేశారని, ఆ హాస్పిటల్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో హుస్సేన్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని, అతడిని పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని సూచించారు.
ఫెర్టిలిటీ సెంటర్లకు బిగ్ షాక్.. యజమానులకు నోటీసులు
ఈ కేసుకు సంబంధించి శారద ఫెర్టిలిటీ సెంటర్, నర్మద ఫెర్టిలిటీ సెంటర్, ఓవాసిస్ ఫెర్టిలిటీ సెంటర్, ఏఆర్టీ ఫెర్టిలిటీ సెంటర్, ఇందిరా ఫెర్టిలిటీ సెంటర్లలో విచారణ జరిపినట్లు శారద తెలిపారు. అయితే, విచారణకు రావాలని ఆదేశిస్తే సెంటర్ల యజమానులు రాకుండా కేవలం సాధారణ ఉద్యోగులను పంపారని ఆక్షేపించారు. తాము అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆ ఉద్యోగుల వద్ద సమాధానాలు లేవని, రికార్డుల్లో పేర్ల నమోదు కూడా సరిగ్గా లేదని స్పష్టం చేశారు. ఫెర్టిలిటీ సెంటర్ల ఛైర్మన్లు లేదా మేనేజింగ్ డైరెక్టర్లు మాత్రమే తమ ముందు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని, నవంబర్ 13న మళ్లీ విచారణకు రావాలని ఆదేశిస్తూ మరోసారి నోటీసులు జారీ చేశామన్నారు.
రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్లు ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నాయో పోలీసుల నుంచి సమగ్ర నివేదిక తీసుకుంటామని చెప్పారు. తమ పరిధిలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, దోషులపై కఠినమైన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ రికార్డులతో సహా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Egg Donation Scam : రూ.30 వేల ఆశ చూపించి.. 50 మంది యువతుల జీవితాలతో ఆటలు
-
YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్‌నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
-
Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
-
Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!