NTV Telugu Site icon

Drunk and Drive Test : ఇకపై ORRపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు

Drunk And Drive

Drunk And Drive

Drunk and Drive Test : మద్యపానం మన సమాజంలో ఒక సాంఘిక సమస్యగా మారింది, దీని ప్రభావం చాలా తీవ్రమైంది. మద్యం మత్తులో వాహనాలను నడిపించడం అనేది అనేక ప్రమాదాలను పుట్టించటమే కాకుండా, అనేక ప్రాణాలను కూడా బలిగొంటున్నది. ఈ అలవాటు వల్ల ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దారిలోని ప్రమాదాలకు కారణమవుతున్న మద్య మత్తు, అన్‌ఫిట్ డ్రైవింగ్, చట్టానికి విరుద్ధంగా ఉన్న ప్రవర్తన మన అందరినీ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అందువల్ల, మద్యపానాన్ని నియంత్రించడం, రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఔటర్ రింగ్ రోడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.

CM Chandrababu: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదాల నివారణకు రాచకొండ పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసిన రాచకొండ పోలీసులు.. ఓఆర్ఆర్‌పై జరుగుతున్న ప్రమాదాల్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లే పలు ప్రమాదాలకు కారణంగా నిర్ధారించుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమని నిర్థారణ వచ్చారు పోలీసులు. ప్రమాదాల నివారణ కోసం ఇక మీదట ఔటర్ రింగ్‌ రోడ్డు పై డ్రంకెన్‌ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించేందుకు రంగం సిద్దం చేశారు. అయితే.. ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు పోలీసులు చేయనున్నారు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్ ల ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Air India: ఎయిరిండియాలో బుల్లెట్లు కలకలం

Show comments