Crop Loan: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల లోపు పంట రుణమాఫీ.. 25 లక్షల మంది రైతులకు లబ్ది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే చారిత్రాత్మకమైన రూ. 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ భారీ రుణమాఫీతో దేశంలోనే రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఒకేసారి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని, ఆ ఘనత కేవలం మన ప్రభుత్వానికే దక్కుతుందని తుమ్మల పేర్కొన్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 20,616 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలు రుణ విముక్తి పొందాయని ఆయన వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల సకాలంలో రుణమాఫీ జరగక, సామాన్య రైతుపై వడ్డీ భారం పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయారని మంత్రి విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, రైతు ప్రయోజనాల కోసం కాదని ఆయన మండిపడ్డారు.
Also Read
- Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
Also Read:Egypt: ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ.. 3,000 ఏళ్ల నాటివి కూడా చెక్కు చెదరకుండా..
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు విముక్తి కల్పించామని తుమ్మల తెలిపారు. కేవలం రుణమాఫీతోనే ఆగిపోకుండా, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి .. నాణ్యమైన విత్తనాల సరఫరా వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్నదాతల ఆదాయం పెంచేలా మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ స్పష్టమైన చర్యల వల్ల తెలంగాణ రైతాంగం మళ్ళీ ఆత్మవిశ్వాసంతో సాగు వైపు అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!