NTV Telugu Site icon

Manikrao Thakre : రెండ్రోజుల్లో హైదరాబాద్ కు కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జి

Manikrao Takare

Manikrao Takare

Manikrao Thakre : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా ఏఐసీసీ అధిష్టానం మాణిక్‌రావు థాకరేను నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన నేత. గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈనెల 11న టీ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మానిక్ రావ్ థాకరే హైదరాబాద్ రానున్నారు. 11,12 తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలతో బిజిబిజీగా ఉండనున్నారు థాక్రే.. 11 తేదీన 10 గంటలకు హైదరాబాద్ చేరుకుని తొలుత.. 11 గంటలకు ఏఐసీసీ సెక్రటరీ లతో సమావేశమవుతారు.

Read Also: Richest Cat: ఆ పిల్లి ఆస్తి రూ.800కోట్లు.. ప్రపంచంలోనే రిచస్ట్ పెట్ యానిమల్

అనంతరం 11:30గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. 12 గంటలకు సీఏల్పీ నేత తో మీటింగ్ అవుతారు. 12:30 సీనియర్ నేతలు ,వర్కింగ్ ప్రెసిడెంట్ లతో చర్చిస్తారు. 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగులో పాల్గొంటారు. 4 గంటలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తారు.. 5 గంటలకు పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశమవుతారు. తిరిగి 12 తేదీ న ఉదయం 10:30కి డీసీసీ అధ్యక్షులతో సమావేశమై వెంటనే…11:30 గంటలకు అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ కానున్నారు థాకరే. 12:30 గంటలకు పార్టీలోని వివిధ సెల్స్ ,డిపార్ట్మెంట్ అధ్యక్షులతో మీటింగులో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు థాకరే తిరిగి ఢిల్లీ వెళ్తారు.