NTV Telugu Site icon

KTR Birthday: కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే విషెస్‌!

Revanth Reddy Ktr

Revanth Reddy Ktr

CM Revanth Reddy Wishesh to KTR: నేడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు. 1976 జూలై 24న సిద్ధిపేటలో జ‌న్మించిన కేటీఆర్‌.. నేటితో 48వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీలు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

Also Read: Telangana Assembly Sessions 2024: తెలంగాణ ప్రజలకు నిర్మలా సీతారామన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే దానం

‘నిత్యం ప్రజాసేవ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి. కేటీఆర్‌కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బర్త్‌డే విషెస్‌ చెప్పారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేటీఆర్‌ భారీ మెజారితో గెలిచారు. ఐటీ, వాణిజ్య‌ శాఖగా మంత్రిగా క్యాబినెట్ మంత్రి హోదాలో ఆయన ప‌నిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

Show comments