TG Climate Conclave 2026: ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్‌మ్యాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Climate Conclave 2026: భవిష్యత్ తరాలకు పచ్చని తెలంగాణను అందించే లక్ష్యంతో వర్షాభావ పరిస్థితులు, పడిపోతున్న భూగర్భ జలాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పారిశ్రామికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యమిస్తూ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తల సూచనలతో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా వాతావరణ మార్పులపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో శుక్రవారం క్లైమేట్ కాన్క్లేవ్ కర్టైన్ రైజర్ నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్, జల సంరక్షణ ఉద్యమకారుడు రాజేంద్రసింగ్ పాల్గొంటారు. సుమారు 100 మంది రైతులు, సర్పంచులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, వన సంరక్షణ సమితులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో క్షేత్రస్థాయి అనుభవాలపై చర్చిస్తారు. నీటి సంరక్షణ, పట్టణ ఉష్ణోగ్రతలు, అటవీ సంపద, వ్యవసాయం, కాలుష్యరహిత ఇంధనం అనే ఐదు అంశాలపై విడివిడిగా చర్చించి, ఒక్కో అంశంపై తక్షణం చేపట్టాల్సిన ఐదు ప్రధాన చర్యలను గుర్తించి ముఖ్యమంత్రికి నివేదిస్తారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నిపుణులు ఎల్‌నినో ప్రభావం, రానున్న వాతావరణ పరిస్థితులపై వివరాలు అందిస్తారు.
Also Read
- Delimitation 2026: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు? డీలిమిటేషన్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన!
- Hyderabad: హైదరాబాద్ చేపల మార్కెట్లపై టీజీ ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక దాడులు.. 200 కిలోల కుళ్లిన చేపలు సీజ్!
- Vangaveeti Radhakrishna: మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
- IND vs NZ: 110 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్‌కు చిక్కని కివీస్..!
డిసెంబర్ 7, 8 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో వెయ్యి మంది ప్రతినిధులతో క్లైమేట్ కాన్క్లేవ్ జరగనుంది. ఈ సదస్సులో సద్గురు జగ్గీ వాసుదేవ్, హార్ట్ఫుల్నెస్ సంస్థకు చెందిన దాజీ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థల నిపుణులు హాజరవుతారు. కరువు నివారణ, వడగాలుల నుంచి రక్షణ, పచ్చదనం పెంపు, జిల్లాల వారీగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత ఇంధన వనరుల అభివృద్ధిపై ఆరు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ముందస్తు ప్రణాళికతో పాటు రాబోయే ఆరు నెలలు, ఏడాది, ఐదేళ్ల లక్ష్యాలతో కూడిన ప్రత్యేక కార్యాచరణను విడుదల చేయనున్నారు. ఆయా ప్రభుత్వ శాఖలకు నిర్దిష్ట బాధ్యతలు కేటాయించనున్నారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా హరిత పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కర్టైన్ రైజర్ సందర్భంగా దాదాపు 50 మంది పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించి సౌర, పవన విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత పర్యాటక రంగాల సంస్థలతో చర్చిస్తారు. డిసెంబర్ 9న 60 మంది పెట్టుబడిదారులతో సమావేశమై, కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ నిల్వ రంగాల్లో సుమారు 10 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే డిసెంబర్ 7 నుంచి 9 వరకు 2,015 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ, పరిశోధన, స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లు సహా 49 సంస్థలతో అటవీ, పర్యావరణ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.
తాజావార్తలు
-
TG Climate Conclave 2026: ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్‌మ్యాప్..
-
Delimitation 2026: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు? డీలిమిటేషన్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన!
-
IND vs NZ 2nd Test: జడేజా, సిరాజ్‌లను పక్కన పెట్టారు.. భారీ మూల్యం చెల్లించారు!
-
Hyderabad: హైదరాబాద్ చేపల మార్కెట్లపై టీజీ ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక దాడులు.. 200 కిలోల కుళ్లిన చేపలు సీజ్!
-
Vangaveeti Radhakrishna: మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!