Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. గిగ్ వర్కర్ల బిల్లుతో సహా 10 బిల్లుల ఆమోదం.?
- రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం
- సుమారు 10 కీలక బిల్లులకు ఆమోదం లభించే అవకాశం
- గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు ప్రధాన అజెండాగా చర్చ
- డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు ఐడీ కార్డులు, బీమా, ఆరోగ్య పథకాలు ప్రతిపాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet Meeting: ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా, మరోవైపు నేడు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో సుమారు 10 కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే పలు డ్రాఫ్ట్ బిల్లులపై చర్చించి, వాటికి తుది రూపం ఇవ్వనున్నారు.
Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు-2025 ప్రధానంగా కనిపిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన సామాజిక భద్రత కోడ్ నేపథ్యంలో, రాష్ట్రంలోని సుమారు 3 నుంచి 4 లక్షల మంది ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్లకు (డెలివరీ బాయ్స్, డ్రైవర్లు) గుర్తింపు కార్డులు, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలను అందించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దీనిపై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
QNet పై భారీ దాడులు… మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు..!
అలాగే కోర్ అర్బన్ యాక్ట్ పై నిరన్యం తీసుకోబోతున్నారు. పాత జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కొత్తగా ‘కోర్ అర్బన్ యాక్ట్’ డ్రాఫ్ట్ బిల్లుపై చర్చ జరగనుంది. పట్టణ పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసం దీనిని తీసుకురానున్నారు. ఇంకా మారుతున్న ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా జీఎస్టీ చట్టంలో అవసరమైన మార్పులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20న ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై నేడు సభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. సభ్యుల సందేహాలు, విపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వం తన బడ్జెట్ ప్రాధాన్యతలను వివరించనుంది.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!