NTV Telugu Site icon

TG Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Tg Cabinet

Tg Cabinet

TG Cabinet: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.  ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుపై చర్చ జరిగింది. ములుగులో గిరిజన యూనివర్సిటీకి ఎకరా 250 రూపాయల చొప్పున భూమిని మంత్రివర్గం కేటాయించినట్లు సమాచారం.ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్ తీర్మానించింది. మెట్రో రైల్ మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1.నాగోల్ టు ఎల్బీ నగర్, 2.ఎల్బీ నగర్ టు హయత్ నగర్. 3.ఎల్బీ నగర్ టు శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరించనుంది. 2022 జులై 1కు సంబంధించిన ఒక డీఏ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగతా నాలుగు డీఎలు విడతల వారిగా ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ త్వరలో క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

 

Read Also: DGP Jitender Reddy: క్రమశిక్షణగల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదు