Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ప్రజా సంక్షేమం, పరిపాలన సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు వీలుగా పలు కొత్త పోస్టుల భర్తీకి క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే, పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన భూమిని కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాలు, ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూర్చేలా బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పు ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ధరణిపై దర్యాప్తునకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయడంతో పాటు ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ క్యాబినెట్ సమావేశంలో గ్రామీణ పల్లెల స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా చట్టంలోని సెక్షన్ 70(3)ను సవరించనున్నారు. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయం (పన్నులు, ఇతర వనరుల ద్వారా వచ్చే నిధులు) ప్రభుత్వ ట్రెజరీలో జమ అయ్యేవి. దీనివల్ల అత్యవసర గ్రామ వికాస పనులకు నిధులు డ్రా చేయడం సర్పంచులు లేదా స్థానిక అధికారులకు ఆలస్యమయ్యేది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ, ఇకపై గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీతో సంబంధం లేకుండా నేరుగా సదరు గ్రామ పంచాయతీ (GP) బ్యాంక్ ఖాతాలోనే జమ చేసుకునేలా చట్ట సవరణకు ఆమోదం లభించింది. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరగడానికి వీలవుతుంది. ఈ చట్ట సవరణను తక్షణమే అమలుల్లోకి తీసుకువచ్చేందుకు వీలుగా ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేయనుంది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
తాజావార్తలు
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!