NTV Telugu Site icon

Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్

Harish

Harish

తెలంగాణ పద్దుల సీజన్ వచ్చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Read Also:TS Assembly Sessions: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌.. ఈసారి హరీష్‌ లెక్క ఎంతంటే?

ఈసారి బడ్జెట్‌లో అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ 20 రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ శాఖలకు సంబంధించి గత కేటాయింపులు, చేసిన వ్యయం తదితర అంశాలపై సమీక్షించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. ఆదివారం సమావేశమయిన రాష్ట్ర మంత్రిమండలి బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసే అవకాశం ఉంది.

The liveblog has ended.
  • 06 Feb 2023 12:16 PM (IST)

    ముగిసిన బడ్జెట్ ప్రసంగం.. సభ బుధవారానికి వాయిదా

    రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన భాగస్వామ్యం. పలు విభాగాలను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కన్నా మన ఉద్యోగుల మెరుగైన జీతభత్యాలు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్‌ వాడీ, ఆశా, ఇంకా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వటం.. దానిని ఏకకాలంలో వర్తింపచేయటం దేశంలోనే ప్రథమం. తెలంగాణ అసెంబ్లీ ఆమోదానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించి ప్రసంగాన్ని ముగించిన హరీష్ రావు. సభను బుధవారానికి వాయిదా వేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.

  • 06 Feb 2023 12:14 PM (IST)

    అమరుల స్మారక కేంద్రం త్వరలో ప్రారంభం

    తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం రూ.178 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలవారు తెలంగాణ తరహా అభివృద్ధి నమూనాను అంతా కోరుకుంటున్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడుతోంది. శాంతి సామరస్యాలను కాపాడుతోంది.

  • 06 Feb 2023 12:11 PM (IST)

    125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

    తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా నిర్మితమైన సెక్రటేరియట్‌ భవనానికి ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అధునాతన వసతులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 7 అంతస్తుల సచివాలయ భవనం నిర్మాణం పూర్తయింది. ఈ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్రానికే గర్వకారణమైన సెక్రటేరియట్‌ భవనాన్ని కాలంతో పోటీ పడుతూ వేగంగా నిర్మింపజేసిన అధికారులకు, ఇంజినీర్లకు, కార్మికులకు అభినందనలు.త్వరలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం రూపుదిద్దుకుంటోంది.రూ. 147 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. సామాజిక న్యాయ స్ఫూర్తికి సమున్నత ప్రతీకగా నిర్మిస్తున్న అంబేద్కర్‌ మహానీయుని విగ్రహం యావద్దేశానిఇక గర్వకారణంగా నిలవబోతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి విగ్రహం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

  • 06 Feb 2023 12:05 PM (IST)

    29 జిల్లాల్లో నూతన కలెక్టరేట్లు

    రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో రూ. 1581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 17 భవనాలను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరో 11 కలెక్టరేట్ల పనులు తుది దశలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్‌ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాలకన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించారు.టీ హబ్ ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

     

  • 06 Feb 2023 12:02 PM (IST)

    హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.

    తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.2,727 కోట్లతో 1875 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టింది. వీటిలో 1684 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. రూ. 3,134 కోట్ల ఖర్చుతో 717 వంతెనల నిర్మాణం చేపట్టగా వాటిలో 350 వంతెనల నిర్మాణం పూర్తయింది.

  • 06 Feb 2023 12:01 PM (IST)

    నాగార్జున సాగర్ లో బుద్ధవనం నిర్మాణం

    ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మించింది. 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును రూ.71 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అనేక ఆకర్షణలతో ప్రత్యేకతలను సంతరించుకొన్న ఈ ప్రాజెక్టు.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను.. ఇతర పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది.

  • 06 Feb 2023 11:56 AM (IST)

    తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం

    2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొన్నది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదు అవుతుంది.

    2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా, 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణలో ఉండగా.. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 శాతానికి కావడం మనందరికీ గర్వకారణం. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్నది. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతానికి జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది.

  • 06 Feb 2023 11:54 AM (IST)

    విమానాశ్రయ విస్తరణకు నిధులు

    SRDP కోసం 42 కీలక రహదారులు, ఆర్వోబీలను ప్రారంభించాం.ఇంకా మిగిలినవి త్వరలో పూర్తి చేస్తాం. లింకు రోడ్లు పూర్తిచేశాం. విమానాశ్రయ విస్తరణకు నిధులు కేటాయించాం. ఎయిర్ పోర్ట్ మెట్రోకు శంకుస్థాపన చేశాం. 6250 కోట్లతో స్వంత నిధులతో మూడేళ్ళలో పూర్తిచేస్తాం. హైదరాబాద్ లో హరిత హారం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాం. ఎస్టీపీలు నిర్మిస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్ళు నిర్మించాం. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అనేకం సాధించాం.

  • 06 Feb 2023 11:43 AM (IST)

    పల్లె ప్రగతికి ప్రత్యేక నిధులు

    కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు
    సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు
    యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ. 200 కోట్లు
    ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21,022 కోట్లు
    ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి రూ. 1500 కోట్లు
    మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ. 200 కోట్లు
    మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు

    పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్‌ శాఖకు రూ. 31,426 కోట్లు
    ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
    యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 500 కోట్లు
    స్పషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌కు రూ.10,348 కోట్లు
    మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లు

    ఫారెస్ట్‌ కాలేజీకి రూ. 100 కోట్లు
    కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ రూ. 200 కోట్లు
    ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌నాన్‌వెజ్‌ మార్కెట్లకు రూ. 400 కోట్లు
    ఆలయాల కోసం రూ. 250 కోట్లు
    మిషన్‌ భగీరథకు రూ. 600 కోట్లు
    మిషన్ భగీరథ అర్భన్‌ రూ. 900 కోట్లు
    వడ్డీ లేని రుణాల కోసం రూ. 1500 కోట్లు
    ఎప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ కోసం రూ. 362 కోట్లు
    ఆరోగ్య శ్రీ కోసం రూ. 1,101 కోట్లు

  • 06 Feb 2023 11:39 AM (IST)

    కంటి వెలుగు.. దేశానికే ఆదర్శం

    సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. తొలి విడత విజయవంతం అయింది. రెండవ విడత కంటి వెలుగు అమలుచేస్తున్నాం. కోట్లాదిమందికి పరీక్షలు నిర్వహించాం. రెండవ విడత ప్రారంభం అయింది. ఖమ్మంలో పథకం ప్రారంభించారు కేరళ సీఎం పినరయి విజయన్. సూపర్ స్పెషాలిటీ పనులు ప్రారంభించాం. 2024 నాటికి పనులు పూర్తయి అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మిస్తున్నాం. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సంకల్పంతో వుంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు పేదల కోసం చేపడుతున్నాం.

  • 06 Feb 2023 11:27 AM (IST)

    బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

    బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గోపన్నపల్లిలో సంక్షేమభవనం నిర్మించాం. త్వరలో ప్రారంభం కానుంది. న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించాం. అడ్వకేట్లు, కుటుంబ సభ్యులకు  ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించాం.తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,17,215గా ఉందని హరీశ్ రావు ప్రకటించారు.

    ఆశా కార్యకర్తలకు ఉన్న 2 వేల పారితోషకాన్ని రాష్ట్ర సర్కార్ 9750 కి పెంచింది

    నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు

    వారు ఇకనైనా ఈ రకంగా మాట్లాడడం మానేయాలని ఆశిస్తున్నాం.

    కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ. 3,210 కోట్లు

    ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
    ఐటీ కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
    న్యాయ శాఖకు రూ. 1,665 కోట్లు
    ఉన్నత విద్యా శాఖకు రూ. 3,001 కోట్లు

    ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు

  • 06 Feb 2023 11:15 AM (IST)

    కేంద్రం సహకారం లేకున్నా గణనీయమయిన అభివృద్ధి

    ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం సహకారం మనకు లభించడంలేదు. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నాం.నీరాను సాఫ్ట్ డ్రింక్ కోసం నిధులు కేటాయించాం. గీత కార్మికులకు 5 లక్షలు పరిహారం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో రజక సోదరులు నిర్వహించే సెలూన్లు, దోభీఘాట్లకు ప్రత్యేక రాయితీలు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రెసిడెన్షియల్ 300 కి పెంచాం. 14 రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటుచేశాం. బడ్జెట్ లో ఆర్టీసీకి నిధులు కేటాయించని ప్రభుత్వం. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయింపు. అంగన్ వాడీ కార్యకర్తల ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలో ఎవరూ ఇవ్వనంతగా ఎక్కువ పారితోషికాన్ని పెంచింది. చిరు ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్నాం. మహిళా భద్రతకు షీటీంలు ఏర్పాటుచేశాం. పోలీసు నియామకాల్లో 33 శాతం మహిళలకు అందిస్తున్నాం.మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. 8500 కోట్లు మైనారిటీలకు ఖర్చుచేశాం.

  • 06 Feb 2023 11:04 AM (IST)

    ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే...

    తెలంగాణలోని పథకాలను జాతీయ హోదా కల్పించమని అడిగినా కేంద్ర వివక్ష చూపిస్తోంది. కేంద్రం సాయం అందించినా, అందించకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగా ఖర్చుచేస్తున్నాం.  తెలంగాణలో 38 వేల 70 కోట్ల ఖర్చుతో విద్యుత్ రంగం స్థాయి పెంచాం. అప్పుడు తెలంగాణలో చీకట్లు ఉంటే.. ఇప్పుడు వెలుగు జిలుగులు వ్యాపించాయి. యాదాద్రిలో అదనపు విద్యుత్ ప్లాంట్ త్వరలో ఉత్పత్తిని ప్రారంభించనుంది.

    కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం 200 కోట్లు

    విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు.

    ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్ సవరణ చేస్తాం
    విద్యా సంవత్సరం నుంచి రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాలిటెక్నిక్ కాలేజీలు ప్రారంభం అవుతాయని బడ్జెట్ లో హరీష్ రావు ప్రకటించారు. జేఎన్టీయూ పరిధిలో త్వరలో మహబూబ్నగర్ ,కొత్తగూడెం లలో ఇంజనీరింగ్ కాలేజీలు

    కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం 1000 కోట్లు

    డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు
    ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు..
    ప్ర‌ణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
    ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366 కోట్లు

     

  • 06 Feb 2023 10:45 AM (IST)

    వ్య‌వ‌సాయానికి, నీటిపారుద‌ల శాఖ‌కు భారీగా కేటాయింపులు

    తెలంగాణలో వ్యవసాయానికి జవజీవాలు కల్పిస్తోంది. ప్రభుత్వ కృష్టితో కరువుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు సుజల స్రవంతిగా మారింది. కేసీఆర్ కృషికి రైతుజనబాంధవుడిగా మారారు. వ్య‌వ‌సాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు. నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 26,885 కోట్లు.

    తెలంగాణకు హరితహారం 1,471 కోట్లు
    రుణమాఫీకి రూ 6385 కోట్లు
    విద్యారంగానికి 19, 093 కోట్లు
    వైద్య ఆరోగ్య రంగం 12, 161 కోట్లు

    పెట్టుబ‌డి వ్య‌యం రూ. 37,525 కోట్లు.

    పల్లె ప్రగతి... పంచాయతీ రాజ్ శాఖకు 31, 426 కోట్లు

    పురపాలక శాఖ కు 11, 372 కోట్లు

    రైతు బంధు - 1575
    రైతు భీమా - 1589
    విద్యుత్ సబ్సిడీ - 12000కోట్లు
    కల్యాణలక్ష్మి - 2000కోట్లు
    బియ్యం సబ్సిడీ - 2000కోట్లు
    కెసీఆర్ కిట్ - 200 కోట్లు
    అసర పెన్షన్లు - 12000కోట్లు

    పురపాలక శాఖ కు 11, 372 కోట్లు
    రోడ్లు భవనాలకు 2,500 కోట్లు

    పరిశ్రమల శాఖకు 4, 037 కోట్లు
    హోమ్ శాఖకు 9,599 కోట్లు

    బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
    మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
    ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
    మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
    గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 15,223 కోట్లు

     

  • 06 Feb 2023 10:36 AM (IST)

    ఈ ఏడాది బడ్జెట్ ఎంతంటే..

    290396 కోట్ల వ్యయం.. రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు కాగా  మొత్తం బడ్జెట్ 2 లక్షల 90 వేల 396 కోట్ల బడ్జెట్.ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్‌ను హ‌రీశ్‌రావు చ‌దివి వినిపిస్తున్నారు. స‌భ‌లో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో వినియోగం తో పాటు అన్నిరంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. తలసరి ఆదాయం బాగా పెరిగింది. 3 లక్షలకు పైగా తలసరి ఆదాయం పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం ఎక్కువ.

    తెలంగాణ బడ్జెట్ 2,90, 396 కోట్లు
    రెవిన్యూ వ్యయం 2,11, 685 కోట్లు
    ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు
    దళితబంధు పథకానికి 17,700 కోట్లు
    ఆసరా పెన్షన్లకు 12 వేల కోట్లు

    బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు
    నీటి పారుదల రంగం 26, 885 కోట్లు
    విద్యుత్ రంగం 12, 727 కోట్లు
    ప్రజా పంపిణీ వ్యవస్థ కు 3,117 కోట్లు

    ఆసరా పింఛన్లు 12,000 కోట్లు

    గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు

  • 06 Feb 2023 10:34 AM (IST)

    ప్రగతి శీల రాష్ట్రంగా తెలంగాణ

    తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది. దార్శనిక ప్రణాళికతో దేశ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సంక్షోభ సమయాల్లోనే ఆర్థిక నిర్వహణ చేస్తున్నాం. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల, ప్రజల సంక్షేమంతో ముందుకు వెళుతున్నాం. 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ ఏర్పడేనాటికి ఆర్థిక ఇబ్బందులు పడ్దాం. రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ పటిష్టకార్యాచరణ వల్ల జీఎస్డీపీ పెరిగింది. అభివృద్ధి మోడల్ పై ప్రతి రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. జీఎస్ డీపీ వృద్ధిరేటు పెరిగింది. కరోనా వల్ల సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి తెలంగాణ బయటపడింది.

  • 06 Feb 2023 10:30 AM (IST)

    ఈ ఏడాది బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే...?

    గతేడాది 2.72 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. ఈ బడ్జె్ట్ కాస్త పెరిగి మూడులక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. గత ఏడాది మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ప్రారంభం అయింది అసెంబ్లీ. అంతకుముందు మర్యాదపూర్వకంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు.బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రి హరీష్ రావుని కోరిన స్పీకర్.

     

    Harish

  • 06 Feb 2023 10:20 AM (IST)

    అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్, హరీష్ రావు

    అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్, హరీష్ రావు. ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు ఆర్థికమంత్రి హరీష్ రావు, మంత్రి ప్రశాంత్ రెడ్డి. అనంతరం హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

  • 06 Feb 2023 10:14 AM (IST)

    రాష్ట్రప్రజల ఆకాంక్షలే ఎజెండా -హరీష్ రావు

    రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు 2023-24కుగాను వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్‌ దస్త్రాలతో తన నివాసం నుంచి బయల్దేరారు.