NTV Telugu Site icon

Asaduddin Owaisi: అఖిలపక్ష ఎంపీల సమావేశంపై ఒవైసీ ఏమన్నారంటే?

Asaduddin Owaisi

Asaduddin Owaisi

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐఎమ్‌ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. కేంద్రం పారదర్శకంగా లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. RRR మంజూరు…మెట్రో మంజూరు కోసం ..బాపు ఘాట్ అభివృద్ధికి … మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని అడిగారు. పార్లమెంట్ లో.. పార్లమెంట్ బయట తెలంగాణ అభివృద్ధి కోసం మద్దతు. మోడీ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇచ్చారు ప్రజలు. కానీ సవతి తల్లి ప్రేమ చూపించారు మోడీ.” అని తెలిపారు.

READ MORE: Kishan Reddy: అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారు..