Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పండుగ, ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రకృతిని, పూలను పూజించే ఈ తొమ్మిది రోజుల మహోత్సవం శనివారం అమావాస్య రోజున ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పూల మార్కెట్లు తంగేడు, గునుగు, చామంతి, బంతి, గులాబీ వంటి రంగురంగుల పువ్వులతో కళకళలాడుతున్నాయి. అయితే, పండుగ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచేయడంతో పూల మార్కెట్లలో ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పూల కొనుగోలు తీవ్ర ఆర్థిక భారంగా మారింది.
తొమ్మిది రోజుల బతుకమ్మ విశేషాలు.. ఈ నెల 18న సద్దుల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మొదటి రోజు శనివారం ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో మొదలై, రెండో రోజు ‘అటుకుల బతుకమ్మ’, మూడో రోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’, నాల్గో రోజు ‘నానే బియ్యం బతుకమ్మ’, ఐదో రోజు ‘అట్ల బతుకమ్మ’, ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’, ఏడో రోజు ‘వేపకాయల బతుకమ్మ’, ఎనిమిదో రోజు ‘వెన్నముద్దల బతుకమ్మ’గా వేడుకలు నిర్వహిస్తారు. ఇక తొమ్మిదో రోజు, ఈ నెల 18వ తేదీన మహా వేడుకగా జరుపుకునే ‘సద్దుల బతుకమ్మ’తో ఈ పూల సంబరం ముగుస్తుంది.
Also Read
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
- Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ధరల భారం ఉన్నా తగ్గని పండుగ ఉత్సాహం
ప్రధాన మార్కెట్లలో బంతి, చామంతి, గునుగు పూల ధరలు గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మొదటి రోజు కావడంతో మార్కెట్లలో పూల ధరలు మరింత ప్రియంగా మారే అవకాశముంది. అయినప్పటికీ, సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ కావడం, బతుకమ్మను తప్పనిసరిగా పూలతోనే పేర్చాల్సి ఉండటంతో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ పరిమాణంలో పూలను కొనుగోలు చేస్తూ పండుగను జరుపుకోవడానికి ఆడపడుచులు సిద్ధమవుతున్నారు. పండుగ వాతావరణం ప్రతి ఇంటా ప్రతికూలతల నడుమ కూడా ఉత్సాహాన్ని నింపుతోంది.
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు