Telangana Bandh: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.. ఎంజీబీఎస్ నుంచి రోజూ 3500 బస్సుల రాకపోకలు సాగించేవి.. బంద్ నేపథ్యంలో ఒక్క బస్సు కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది.. ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల నేతల ఆందోళన సాగిస్తున్నారు. జూబ్లీ బస్ స్టేషన్‌లో బీసీ సంఘాల నేతలు బైటాయించారు.
READ MORE: Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
జేబీఎస్ దగ్గర బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బంద్‌లో పాల్గొన్నారు.. రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. బీసీ సంఘాలు దిల్‌సుఖ్‌నగర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగాయి. సంఘం నేతలు ప్రైవేట్ బస్సులు, ప్రైవేటు వాహనాలను అడ్డుకున్నారు. దీంతో నిరసనకారు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు.. ఈ బంద్‌తో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్తాండ్‌లో భారీగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. కర్ణాటక, ఏపీ ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా తీసుకుంటున్న ప్రైవేట్ వాహనదారులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు.
READ MORE: Daksha : రెండు హత్యలు, ఒక్క అనుమానం.. OTT లో ‘దక్ష’ థ్రిల్లర్ రియల్ ఎక్స్పీరియన్స్!
