Telangana Bandh: అసలే పండగ. మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో వలస వచ్చిన కార్మికులతో పాటు విద్యార్థులు పెట్టేబేడ సర్దుకుని సొంత స్థలాలకు పయణమయ్యారు. కానీ.. బస్టాండ్‌లకు చేరుకోగానే బస్సులు బంద్ అని తెలిసి అసహనం వ్యక్తం చేశారు. కొందరికి ముందే బంద్ అని తెలిసి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.
Telangana Bandh: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.. ఎంజీబీఎస్ నుంచి రోజూ 3500 బస్సుల రాకపోకలు సాగించేవి.. బంద్ నేపథ్యంలో ఒక్క బస్సు కూడా…