Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం

Gaddam Prasad

Gaddam Prasad

Gaddam Prasad: సబిత, సునీత, కోవా లక్ష్మి అంటే తనకు అత్యంత గౌరవం ఉందని.. వాళ్లు తనకు తోబుట్టువులతో సమానమని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. సబితమ్మకు జరిగిన దానిపై తాను విచారణ జరిపించాలని చెప్పినట్లు గుర్తు చేశారు.. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. “హరీష్‌రావు.. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడు.. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. సభ అధ్యక్షుడి మీదనే మాట్లాడారు మీ సభ్యుడు. మీరు లొల్లి చేస్తే నేనేం భయపడను. మీ తల్లిని అనలేదు హరీష్.. తా తల్లిని దూషించారు. దీని సంగతి ఏంటి? సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయండి అని చెప్పిన. ముందు నన్ను అవమానించిన దానిపై మాట్లాడు హరీష్” అని స్పీకర్ ఫైర్ అయ్యారు.

మరోవైపు.. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. మహిళా శాసనసభ్యులపై దాడిని పోలీసులు పరిశీలిస్తారని అంటున్నారు. మగ పోలీసులు సబితమ్మ గొంతు పిసికారు. ఇప్పటి వరకు విచారణ జరగలేదు. పోలీసులకు ఫిర్యాదు ఇస్తే.. తిరిగి మాపై కేసు పెట్టారు. మమల్ని కాపాడాల్సింది మీరే. ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ లాగా జరిగింది. కౌరవులకు పట్టిన గతే.. కాంగ్రెస్‌కి పడుతుంది. ఇక దీనిపై రాద్దాంతం అవసరం లేదు.” అని హరీష్ రావు పేర్కొన్నారు.