Site icon NTV Telugu

TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా..?

Telangana Assembly Sessions

Telangana Assembly Sessions

ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానుండగా..ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. కాగా.. ఈ సమావేశాలు ఈనెల 27 వరకు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కేబినెట్‌లో చర్చ జరిగింది. అంతేకాకుండా.. ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 10,950 విలేజ్‌ లెవల్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

International Women’s Day: ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” స్టోరీ ఇదే..

కాగా.. గత బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. దీంతో.. కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధించారు. ఈ క్రమంలో.. ఈసారి జరగనున్న సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ అధినేత పాల్గొంటారని గులాబీ వర్గాలంటున్నాయి.

Loganayagi Case: క్రైమ్ కథా చిత్రం.. ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి ప్రేయసి హత్య..

ఇదిలా ఉంటే.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏప్రిల్ 27న జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌పై పార్టీ నేత‌ల‌తో కేసీఆర్ సుధీర్ఘంగా చ‌ర్చించారు. బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

Exit mobile version