Telangana Assembly 2024 LIVE: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో 7వ రోజుకు చేరాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఇవాల్టి (శనివారం)తో 7వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. నేడు ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు. దీంతో సభ్యులు అందరూ రైతు భరోసా నిధుల విడుదల మాట్లాడనున్నారు. అటు రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానానికి సిద్దమైంది. హైదరాబాద్ లో గత సంవత్సర కాలంగా మౌళిక వసతుల కల్పనలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం వైఫల్యం అయింది అంటూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం కోరింది.
ఏడు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది.
హీరో పై చర్యకి తమ పార్టీ మద్దతు ఉంటుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పోలీసులకు కూడా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చనిపోయిన తల్లికి.. కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానన్నారు. అల్లా.. ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్ననని అక్బరుద్దీన్ చెప్పారు.
అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బెనిఫిట్ షోలు లేవని చెప్పారు. ఇకనుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమన్నారు. అలాగే.. పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.
సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. ఓ సినీ నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి తెలిపారు. అనుమతి ఇవ్వలేదు.. ఒక్కటే దారి ఉంది.. హీరో, హీరోయిన్ రావొద్దనిచెప్పాం.. హీరో కారులో వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే సరిపోయేది.. రోడ్డు షో చేసుకుంటూ హీరో వచ్చాడు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగితే పట్టించుకోలేదని సీఎం పేర్కొన్నారు.
రైతు భరోసాపై చంద్రాయణగుట్ట ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు.
21 ఏండ్లు అనుభవం అని చెప్పుకుంటారు (హరీష్ రావు).. ఆయన అనుభవం, అలాంటి వ్యక్తి స్పీకర్ మీద దాడి చేస్తారా..? అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బావ బామ్మర్ది (కేటీఆర్, హరీష్)లకు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రా మూసి కి పోదాం అన్నారు. నేను (రేవంత్ రెడ్డి)..రాజగోపాల్ రెడ్డి వస్తాం.. గన్ మెన్ లు లేకుండా పోదాం అన్నారు.
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం చేసుకునే వారికి సహాయం చేయడం రైతు బంధు లక్ష్యం.. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో లో చేర్చిందన్నారు. రూ.22606 కోట్ల రూపాయల రైతు బంధు అనర్హులకు వేశారన్నారు. రోడ్లు ,రాళ్లు ఉన్న భూములకు రైతు బంధు ఇచ్చారన్నారు. రాజీవ్ రహదారికి రైతు బంధు ఇచ్చారని తెలిపారు.
పదేళ్లు 10 కిలో మీటర్లు టన్నెల్ కూడా తొవ్వకపోవడాన్ని మద్దతు ఇస్తారా జగదీష్ రెడ్డి? సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ ఎస్ఎల్బీసీ నీ పదేళ్లు పడుకో బెట్టారన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ విధిలేని పరిస్థితిలో అక్కడ ఉన్నారు. వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళే అన్నారు.
నల్లమల నుండి వచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ తొక్కితే అక్కడికి పోయారు వాళ్ళు అన్నారు. నేను గుంటూరులో చదువుకున్నా తెలివి తేటలు లేవు నాకు .. సామాన్యుడి తెలివి తేటలు ఉన్నాయి నాకు అని సీఎం అన్నారు.
ఓల్డ్ సిటీ కాదు...అది ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాని అభివృద్ధి గురించి ఎవరికీ పట్టదు అన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ చాలా రోజులుగా ఓల్డ్ సిటీ గురించి అడుగుతున్నారని సభలో పేర్కొన్నారు.
మూసి చేస్తా అంటే వద్దు అంటాడని సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ వద్దు అంటాడు, రుణమాఫీ వద్దు అంటాడు, ఇండస్ట్రీ పెడతా అంటే వద్దు అంటివి? ఏం చేయాలి మరి? అని ప్రశ్నించారు. దొంగలకు సద్దులు మోస్తున్నాడని అన్నారు.
మా పిల్లలు డాక్టర్లు కావద్దా? సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డం వస్తె తొక్కుకుంటూ పోతా అని అందుకే చెప్పిన అన్నారు.
ఎయిర్ పోర్ట్ లో దగ్గరలో 15 వేల ఎకరాల భూమి సేకరించింది బీఆర్ఎస్ కాదా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోట్ల రూపాయలతో లావాదేవీ పెట్టుకుని ఫార్మా పెట్టొచ్చు అంట అని మండిపడ్డారు. నేను దూరంగా... ఏమి లేని నా ప్రాంతానికి మెడికల్ కాలేజి పెట్టినా తప్పే అన్నారు. కాలేజీలు తీసుకున్న తప్పే అంటారన్నారు. కొడంగల్ 3 లక్షల ఎకరాల్లో 1300 ఎకరాలు తీసుకుని పరిశ్రమలు పెడదాం అనుకున్న అన్నారు.
కొడంగల్ ప్రజలకు నేను ఎంత చేసినా తక్కువే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రజలు ఇచ్చిన దేవీనతో సీఎం రేవంత్ రెడ్డి అయ్యానని తెలిపారు.
అప్పులు ఎక్కడ ఉన్నాయో...తప్పులు ఎక్కడ ఉన్నాయో చూడనివ్వండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా చేతులు కూడగట్టుకోవడానికి కూడా లేకుండా చేస్తున్నారని తెలిపారు. మా చేతులు విరగొట్టాలి అని చూస్తున్నారు వాళ్ళు సీఎం అన్నారు.
కేసీఆర్, ఈటెల కూడా దొంగ లెక్కలు చూపలేదన్నారు. కానీ కేసీఆర్ తరవాత వచ్చిన హరీష్ రావు దొంగ లెక్కలు రాశాడని అన్నారు. ఈ పెద్దమనిషి పని ఎట్లా ఉందంటే ప్రశ్నపత్రం నువ్వే రెడీ చేసి... నువ్వే సమాధానం చెప్పి...నువ్వే ఎక్కువ మార్కులు వేసుకుని ..ఇదే నా ఘనత అంటున్నాడని సీఎం అన్నారు.
శాసన మండలిలో లంచ్ బ్రేక్. మండలిలో మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ 2024 బిల్లుకు శాసనమండలి ఆమోదం..
తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు 2024 కు శాసనమండలి ఆమోదం..తెలంగాణ పంచాయతీ రాజ్ బిల్లు 2024 కు శాసనమండలి ఆమోదం..
పదేళ్లు బాత్ రూం కూడా కట్టనందుకు క్షమాపణ చెప్పాలని సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆయన(కేసీఆర్) రావడం లేదు సభకు అన్నారు. వస్తే కడిగెద్దాం అని ఏడాది నుండి చూస్తున్న అన్నారు సీఎం రేవంత్. మీరెంత... మీ స్థాయి ఎంత? అని ప్రశ్నించారు. నా నిబద్ధతను మీరా ప్రశ్నించేది? అని మండిపడ్డారు. పేపరు దిద్దలేని మీరు..Tspsc పరీక్ష పెట్టలేని మీరు అన్నారు. నన్నా... అడిగేది అన్నారు. సీఎం ప్రసంగాన్ని బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు.
ఢిల్లీకి నేను వెళ్తుంది...ఆర్థిక శాఖ న్యాయనిపుణులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. హాస్టల్ లకు మీరేం చేశారు? సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హాస్టల్ కట్టలేదన్నారు. అమ్మాయిలు టాయ్‌లెట్ కట్టలేదని, అమ్మాయిలు నాలుగు గంటల నుండి క్యూ కట్టాల్సిన పరిస్థితి అన్నారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్, పేపర్లు, టీవీలు పెట్టుకున్నారు కానీ.. హాస్టల్ ఎందుకు కట్టలేదు? అని ప్రశ్నించారు సీఎం.
వాళ్ళు తెచ్చిన అప్పు 11.5 ఇంట్రెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటం.. వేరే దేశాల్లో ఐతే ఉరి తీసేవాళ్ళు అని సీఎం అన్నారు.
పదేళ్లలో మీరు కట్టింది కూలేశ్వరం కట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఘనత చెందిన కూలేశ్వరంలో ఏం సాధించారు? అని ప్రశ్నించారు. తెలంగాణ అప్పు 7 లక్షల 22 వేల కోట్లు అన్నారు. ఆరు గ్యారంటీలు ఆలస్యం అయ్యింది అంటే... దానికి కారణం ఆ పాపాత్ములదే అని సీఎం మండిపడ్డారు.
రోశయ్య రూపాయి..రూపాయి లెక్క రాసి.. పొదుపు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 16 మంది సీఎంలు 72 వేల కోట్లు అప్పులు చేస్తే.. వీళ్ళు దివాలా చేశారన్నారు.
ఒక్క కుటుంబం 6 లక్షల 40 వేల అప్పు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మళ్ళీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మాట తప్పని..మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు సభలో కి వచ్చినప్పుడు...కేసీఆర్ సభలోనే లేడు అని అన్నారు. చెప్పినా మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత... సోనియా గాంధీ కాాళ్ళ పై బోర్లా బొక్కల పడినడు అక్కడ అరిచే ఆయన అని సీఎం అన్నారు. సోనియా గాంధీ గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉంటే మంచిదన్నారు.
స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే స్థాయిలో ఉన్నారు వాళ్ళు అని బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.8 వేల కోట్లు కూడా లేవు మా దగ్గర నీ కేసీఆర్ సభలో నే చెప్పారని తెలిపారు. మీ పాపాలు నేను చదవాల్సి వస్తుంది.. ఇది నాకు పాపం లెక్క అయ్యిందన్నారు.
బీఆర్ఎస్ వాళ్లకు ప్రతిదీ..ఇచ్చి పుచ్చుకునే అలవాటు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు..మా కుటుంబ సభ్యులు అన్నారు. రైతులను మిత్తిల నుండి కాపాడటానికి రుణమాఫీ ఇప్పుడే చేశామన్నారు. ఐదేళ్ల తర్వాత చేసే వాళ్ళం అన్నారు. కానీ రైతులు అప్పుల పై వడ్డీ భారం ఉండొద్దు నీ ముందే చేశామన్నారు.
రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిన సహనంతో సభలో కూర్చున్నాం. ప్రజలు పూర్తీగా చూస్తున్నారు.
వాళ్ళు..మమ్మల్ని అర్దర్శంగా తీసుకోండి అంటున్నాడన్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే... మేము బయటకు వెళ్ళిపోతామన్నారు. సభలోకి కేసీఆర్ వస్తె... సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక పోతారు అని రావడం లేదన్నారు. ఆయన బాధ ఆయనది అని తెలిపారు.
కానీ కేసీఆర్ అనుభవం నుండి కొన్ని తెలుసుకుందాం అనుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంశానికి ప్రాధాన్యత ఉండాలి మీ నాయకత్వంలో చివరి పేదవారి వారి వరకు ప్రభుత్వ పథకం అందాలన్నారు. గడిలో ఉన్న వాళ్ళు సీలింగ్ భూములు... రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారని తెలిపారు.
రాజీవ్ రహదారిలో పోయినా భూములకు కూడా ఇచ్చారన్నారు. కేసీఆర్ నియోజక వర్గం లోని రాజీవ్ రహదారికి కూడా ఇచ్చారన్నారు. అమనగల్ హైవే భూములకు కూడా ఇచ్చిందన్నారు. క్రషర్ యూనిట్ లకు ఇచ్చారని తెలిపారు. మైనింగ్ భూములకు ఇచ్చారన్నారు. నకిలీ పట్టాల తో రైతు బందు తీసుకున్నారు. ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ వచ్చి సలహా ఇస్తారు అనుకున్న.. కేసీఆర్ కంటే తుమ్మల సీనియర్ అన్నారు.
72 వేల కోట్లు గత ప్రభుత్వం రైతు బందు వేశారన్నారు. సాగులో లేని భూములకు 21 వేల కోట్లు ఇచ్చారు వాళ్ళు అన్నారు. లే అవుట్లు... రియల్ ఎస్టేట్ చేసిన వాళ్లకు కూడా రైతు బందు వచ్చిందన్నారు. సుమారు 22 వేల కోట్లు అయాచితంగా వెళ్ళిందన్నారు. రాళ్ళకు..రప్పలకు గుట్టలకు ఇద్దమా..? అని ప్రశ్నించారు.
రైతు భరోసా పై అనుమానాలు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న చరిత్ర అందరికీ తెలుసని తెలిపారు. రైతు బందు ఉద్దేశం... వ్యవసాయ పెట్టుబడి కి సహాయం అన్నారు. జీఓ అలాగే ఇచ్చారు... కానీ అమలు చేసే విధానంలో.. బాధ్యతారహితంగా వ్యవహారం చేశారన్నారు.
రైతు భరోసా పై విధివిధానాలు ఖరారు చేయాలని అనుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తాం అని చెప్పినం అన్నారు. సభ్యుల సూచనలు తీసుకోవాలి అనుకున్నామన్నారు.
ఆరోగ్య శ్రీ అంటే కార్పోరేట్ ఆసుపత్రులు పట్టించుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వ్యవసాయ పొలాలకు రోడ్లు వేయండి అని తెలిపారు. వర్షాకాలంలో పొలాలకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయ పొలాలకు రోడ్లు వేసేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని తెలిపారు.
రైతులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తాము చేసినం ఆంటే తాము చేసినమని చెప్పుకుంటున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చిన సహాయాన్ని గత ప్రభుత్వం చెప్పలేదన్నారు. తెలంగాణలో కోటి ఇరువై లక్షల పత్తి కేంద్రం కొనుగోలు చేయకపోతే వేలాది మంది రైతులు ఇబ్బంది పడేవారని తెలిపారు. 8లక్షల 50వేల సోయాబిన్ ను కేంద్రమే కొంటుందని తెలిపారు.
రైతు భరోసా చర్చలో బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలు 2014కంటే ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయము, రైతులు లేనట్లుందన్నారు. భూమి శిస్తు మీదనే ఆధారపడి ఆ నాడు పాలన సాగేదన్నారు.
కోతలు పెడితే అది మీ ఇష్టం అని కేటీఆర్ అన్నారు. కౌలు రైతులకు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వాలన్నారు. రాష్ట్ర రైతాంగం కోసం చేయండి అని సూచించారు. అనుముల కుటుంబం కోసం, బామర్ధి కోసం, అన్నదమ్ముల కోసం, అదాని కోసం చేయకండి అని కేటీఆర్ అన్నారు.
అదాని కోసం కొడంగల్ రైతులను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు రుణమాఫీ పూర్తి జరిగింది అంటున్నారు. 60 శాతం అయ్యింది అని మరొకరు అంటున్నారు.. రైతు రుణమాఫీ ఎంత మేర జరిగిందో స్పష్టంగా చెప్పాలన్నారు. 25 శాతమా, 50 శాతమా మీకే స్పష్టత లేదన్నారు.
కేటీఆర్ పదే పదే అబద్ధాలు చెప్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అప్పులపై మాజీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారన్నారు. 30 నిమిషాలు టైం ఇస్తున్నా రికార్డులు తీయాలని కోరుతున్నా అన్నారు.
కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేటీఆర్‌తో పాటు రాజీనామా చేయడానికి నేను సిద్ధం అన్నారు. మా జిల్లాకు నీళ్లు ఇవ్వలేదననారు. గత ప్రభుత్వం అప్పులు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ నిజాలు మాట్లాడాలన్నారు.
కేటీఆర్ కేంద్రం గురించి మాట్లాడుతున్నారని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. సివిల్ సప్లై లో... కోట్ల అవినీతి జరిగింది కేటీఆర్ హయంలోనే అన్నారు. అన్నిటి పై చర్చకు పెట్టండి అని తెలిపారు.
తెలంగాణలో కోటిమందికి పాన్ కార్డులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు భూమితో ఉన్న సంబంధం తెంచేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు అందరికీ అన్నీ.. ఇప్పుడేమో కొందరికే అన్ని అంటున్నారని తెలిపారు.
ఎవరు చెప్పారు.. కోత పెడుతున్నారని సభలో మంత్రి తుమ్మల అన్నారు. పంట వేయని వారికి ఇవ్వద్దు అని మీరు జీఓ ఇచ్చారు...కానీ డబ్బులు ఇచ్చారన్నారు. కొత్త విది విధానాలు కోసం సభలో చర్చ పెడుతున్నామన్నారు. మీరు సూచన చేస్తే... కేబినెట్ లో అప్రూవల్ చేస్తామన్నారు. మీరు ఆపినా... రైతు బంధు మేము ఇచ్చామన్నారు.
సభలో కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లి, కొడంగల్, సిరిసిల్ల, పాలేరుకు పోదామా? ఏ ఒక్క ఊరికి పోయినా వంద శాతం రైతులు రుణమాఫీ జరిగిందని చెబితే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా మీకిచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు.
ఇవాల లాగ్‌బుక్‌లో 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటే.. బీఆర్ఎస్ సభ్యులమంతా రాజీనామా చేస్తామని కేటీఆర అన్నారు. సగటున 19 గంటల కరెంట్ ఇచ్చారి మీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారన్నారు. సమావేశాలను మరో 10 రోజుల పొడిగించి.. విద్యుత్, నీటి పారుదలతో సహా అన్ని అంశాలపై చర్చిద్దాం అన్నారు.
సబ్జెక్టు ఏంది..ఆయన మాట్లాడుతుంది ఏంది..? కేటీఆర్ అన్నారు. మమ్మల్ని కంట్రోల్ చేయొద్దు అన్నారు. రా తుంగతుర్తి పోదాం... నల్గొండ జిల్లా ప్రాజెక్టుల మీద చర్చకు పెట్టండి అన్నారు.
రేవంత్ పుణ్యమా అని ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసుకుంటామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూసి క్లీన్ చేసుకొని... మేము బతకాలన్నారు.
నల్గొండలో క్రాఫ్ హాలిడే పెట్టారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పోతిరెడ్డి పాడు నుండి జగన్ నీళ్లు తీసుకుపోతే పట్టించుకోలేదు వాళ్ళు అన్నారు. నల్గొండ జిల్లాకు ఏం చేశావు అంటున్నాడన్నారు. మీరు ఏం చేయలేదు.. కాబట్టే మాకు 60 వేల మెజార్టీతో గెలిపించారన్నారు.