తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్దం చేసుకోంటున్నాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై ఆయన అసెంబ్లీ సెషన్స్ లో ప్రస్తావించే ఛాన్స్ ఉంది.
Read Also: Neethone Nenu: జోరుమీదున్న కుషిత కళ్లపు.. హీరోయిన్ గా‘నీతోనే నేను’ టైటిల్ పోస్టర్ లాంచ్
మరో వైపు రాష్ట్ర ప్రజల సమస్యలపై కేసీఆర్ సర్కార్ పై కమలం పార్టీ కూడా సభలో ప్రశ్నలను సంధించేందుకు అవకాశం ఉంది. ఇంకో వైపు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను కూడా ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఎందుకంటే.. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఈ అసెంబ్లీ సెషన్స్ ను అధికార, విపక్షాలు సీరియస్ గా తీసుకొనే ఛాన్స్ ఉందని పొలిటికల్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చే అంశంతో పాటు భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్ ఉండగా.. మరో వైపు విపక్షాలకు ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టిందో వివరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక, చూడాలి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా కొనసాగుతాయి అనేది.
