Ap- Telangana : ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ స్టార్ట్ అయింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ తో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై కూడా చర్చ జరగబోతోంది. ఈ మీటింగ్ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకరికి ఒకరు బొకేలు ఇచ్చుకుని శాలువాలు కప్పుకున్నారు. ఈ సమావేశంలో సీఎంలతో పాటు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. వీరితో పాటు సీఎస్ లు కూడా వెళ్లారు.
Read Also : RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ పై కేసు..
ఈ మీటింగ్ కు ముందు ఇద్దరు సీఎంలు తమ అధికారులు, మంత్రులతో సమావేశం అయ్యారు. మీటింగ్ లో లేవనెత్తాల్సిన పాయింట్స్ పై చర్చించారు. ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్ట్ కు తెలంగాణ ముందు నుంచే వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మీటింగ్ లో ఎలాంటి అంశాలు చర్చిస్తారు.. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారనేది అంతా వెయిట్ చేస్తున్నారు.
Read Also : Baahubali : బాహుబలి రన్ టైమ్ పై రానా క్లారిటీ..
