NTV Telugu Site icon

Hanuman OTT: అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jai Hanuman

Jai Hanuman

Teja Sajja’s Hanuman Movie Streaming on ZEE5: ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా ‘హనుమాన్‌’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్‌.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే ఓటీటీలలో వచ్చినా.. హనుమాన్‌ మాత్రం రాలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది.

హనుమాన్‌ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘జీ5’లో ఆదివారం (మార్చి 17) ఉదయం నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్‌ శనివారం (మార్చి 16) రాత్రి నుంచి ‘జియో సినిమా’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. సడన్‌గా ఓటీటీలోకి హనుమాన్‌ సినిమా రావడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్‌ కాబట్టి చాలామంది సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సబ్‌స్క్రైబర్స్‌ కూడా డబ్బులు చెల్లించి సినిమా చూడాల్సి ఉంది.

Also Read: Kareena Kapoor-Yash: కేజీఎఫ్ స్టార్ ‘యశ్‌’ సరసన కరీనా కపూర్‌?

సూపర్‌ హీరో కథకు పురణాలను ముడిపెట్టి డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ సినిమాని తీశారు. తేజ సజ్జా అద్భుతంగా నటించాడు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, అమృతా అయ్యర్‌, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. హిట్ అందుకోవడంతో దాదాపు 66 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

Show comments