Youtube Delivery: యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రియురాలికి డెలివరీ చేసిన ప్రియుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtube Delivery: ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. మనం మన ఫోన్లను చూసి వివిధ విషయాలు నేర్చుకుంటున్నాము. కొంతమంది యూట్యూబ్ వీడియోల నుండి మంచి విషయాలు నేర్చుకుంటూ జీవితంలో సక్సెస్ అబుతున్నారు. మరికొందరు అదే యూట్యూబ్ ను చూసి చెడిపోతున్నారు. ఇకపోతే తాజాగా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: F-16 Shot Down: టెన్షన్.. టెన్షన్.. పాక్ డ్రోన్ దాడులు.. పాకిస్థాన్ యుద్ధ విమానం నెలమట్టం!
Also Read
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ఝార్సుగూడ జిల్లాలోని గోపిచెట్టిపాళయం ప్రాంతంలో ఒక యువకుడు తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే ఇదివరకు అతను చదివిన ఒక ప్రైవేట్ కళాశాలలోని 19 ఏళ్ల అమ్మాయిని కలిశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహంగా మొదలైన పరిచయం తరువాత ప్రేమగా మారింది. తరచుగా కలవడం కష్టం కావడంతో, వారిద్దరూ భార్యాభర్తలమని చెప్పుకుంటూ అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించారు. ఇంతలో ఆ అమ్మాయి గర్భవతి అయింది. అయితే, తమ కూతురు ఒక యువకుడితో నివసిస్తుందని ఆ అమ్మాయి కుటుంబానికి తెలియదు. గర్భవతిగా ఉన్న అమ్మాయికి ఒకరోజు అకస్మాత్తుగా కడుపులో తీవ్రమైన ప్రసవ నొప్పి మొదలైంది. ఈ సమయంలో ఇద్దరూ బయటకు వెళితే ఆ అమ్మాయి గర్భవతి అని అందరికీ తెలుస్తుందని అనుకున్నారు.
Read Also: AIMPLB: యుద్ధం పరిష్కారం కాదు.. భారత్‌లోని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యాఖ్య
అయితే, ప్రియురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులుగా ఇంట్లో డెలివరీ ఎలా చేయాలో యూట్యూబ్‌లో వెతకడం ప్రారంభించాడు ప్రియుడు. దీని తర్వాత, అతను యూట్యూబ్‌లో వీడియో చూడటం ద్వారా తన స్నేహితురాలికి డెలివరీ చేసి ఇంట్లోనే ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. అయితే, ఈలోగా ఆ అమ్మాయికి అధిక రక్తస్రావం కావడంతో చాలా ఆందోళన చెందారు. అలా కొద్దీ సమయం తర్వాత రక్తస్రావం ఆగి, నొప్పి తగ్గకపోవడంతో మరుసటి రోజు ఆ బాలికను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె బిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించారు. అయితే, తల్లిని మాత్రమే ఆసుపత్రికి ఎందుకు తీసుకువచ్చారని నర్సులు ఆ యువకుడిని అడగడంతో అసలు కథ బయటపడింది. దీని తరువాత, వైద్యులు ఆ యువకుడి ఇంటికి వెళ్లి పరిశీలించగా.. అమ్మాయి ప్రసవం ఎలా జరిగిందో వారికి తెలిసింది. ఆ యువకుడి ఇంటికి చేరుకున్న వైద్యులు ఆ యువకుడి తల్లి ఇంట్లో ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. వైద్యులు సమీపంలోని సంచిలో శిశువు బొడ్డు తాడును కనుగొని దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తరువాత, అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం గురించి సమాచారం అందింది.
తాజావార్తలు
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?