China: ప్రపంచాన్ని చైనా ఆశ్చర్యపరిచింది. సాంకేతిక రంగంలో డ్రాగన్ దేశం నయా సంచలనం సృష్టించింది. మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీలో, చైనా ఏ ఇతర దేశం సాధించలేని ఘనతను సాధించింది. కేవలం రెండు సెకన్లలో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఒక సరికొత్త హైస్పీడ్ రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ హై-స్పీడ్ పరీక్షను చైనాలోని 400 మీటర్ల పొడవైన మాగ్లెవ్ టెస్ట్ లైన్లో నిర్వహించారు.
READ ALSO: Ponguleti Srinivas Reddy : ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ
మాగ్లెవ్ అంటే..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదికల ప్రకారం.. ఈ సరికొత్త హైస్పీడ్ రైలు మెరుపు వేగంతో దూసుకెళ్లి సురక్షితంగా ఆగిపోయింది. దీని బరువు దాదాపు ఒక టన్ను వరకు ఉంది. ఇది ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ పరీక్ష అని సమాచారం. మాగ్లెవ్ రైళ్లకు చక్రాలు ఉండవు. సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు రైలును పట్టాలపైన తేలడానికి అనుమతిస్తాయి. రైలు, పట్టాల మధ్య ఘర్షణ లేకపోవడం చాలా ఎక్కువ వేగాన్ని అనుమతిస్తుంది. ప్రస్తుతం చైనా హై-స్పీడ్ రైళ్లు గంటకు 350 కి.మీ (217 mph) వేగంతో నడుస్తాయి. వీటికి 5G కనెక్టివిటీని కూడా అందిస్తున్నాయి. డిసెంబర్ 25న చైనా ప్రభుత్వ CCTV తాజాగా వైరల్ అవుతున్న ఈ పరీక్ష వీడియోను విడుదల చేసింది. దీనిలో ఒక చాసిస్ లాంటి వాహనం మెరుపు వేగంతో ట్రాక్ వెంట పరుగెడుతున్నట్లు చూపించింది. ఈ రైలు నిర్ణీత వేగాన్ని చేరుకొని ఆగిన తర్వాత, దాని వెనుక దట్టమైన పొగ కనిపించింది.
🚄🇯🇵 Le train japonais Maglev L0 ne se contente pas d’être rapide : il redéfinit littéralement la notion de vitesse dans le transport moderne.
Grâce à la lévitation magnétique, il flotte au-dessus de son rail, éliminant toute friction et lui permettant d’atteindre plus de 600… pic.twitter.com/hnV4VnZ3Ro
— Le Contemplateur (@LeContempIateur) December 4, 2025
READ ALSO: Akshay Khanna: ధురంధర్ విలన్‌కు దృశ్యం 3 నిర్మాత షాక్..