Tech Layoffs: ఇంటికే పరిమితమైన సాఫ్ట్వేర్ సుధీర్ల సంఖ్య లక్షన్నర. 2008 కన్నా ఈ ఏడాదే అధిక ‘టెక్’ లేఆఫ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs: 2022.. మరికొద్ది రోజుల్లో ముగుస్తోంది. కానీ.. ఈ సంవత్సరం ఇప్పటికే లక్షన్నర మంది ఉద్యోగ జీవితాలు తాత్కాలికంగా ముగిశాయి. మీరిక రేపటి నుంచి ఆఫీసుకి రావొద్దంటూ 965 టెక్ కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కి చెప్పేశాయి. 2008లో ప్రపంచ ఆర్థికమాంద్యం తలెత్తినప్పుడు కేవలం 65 వేల మందే కొలువులను కోల్పోగా 2009లో కూడా దాదాపు ఇదే సంఖ్యలో జాబులు పోయాయి. దీనికి రెట్టింపు కన్నా ఎక్కువగా ఈ ఏడాది లేఫ్‌లు ప్రకటించటం గమనించాల్సిన విషయం.
read also: India in World Steel Production: ఉక్కు ఉత్పత్తిలో.. ప్రపంచంలో..
Also Read
ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ అనే గ్లోబల్ ఔట్‌ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ ట్రాన్సిషనింగ్ సంస్థ ఈ డేటాను వెల్లడించింది. టెక్ కంపెనీలు.. వచ్చే ఏడాది మరియు ఆ తర్వాత కూడా మనుగడ సాగించాలనే వ్యూహంలో భాగంగానే లేఫ్లను అమలుచేస్తున్నాయని మార్కెట్‌వాచ్ అనే సంస్థ తన రిపోర్ట్‌లో తెలిపింది. లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ అనే క్రౌడ్సోర్స్డ్ డేటాబేస్ సైతం ఉద్యోగుల తొలగింపుల లెక్కలను వెల్లడించింది. కొవిడ్-19 అనంతరం 14 వందల 95 టెక్ కంపెనీలు 2 లక్షల 46 వేల 267 మందిని నౌకరీల్లోంచి తీసేశాయని పేర్కొంది.
2022 ఇంతకన్నా ఘోరంగా ఉందని, ఇదే దుస్థితి 2023లోనూ కొనసాగుతుందని హెచ్చరించింది. నవంబర్ నెల మధ్య నాటికి అమెరికాలోని టెక్ సెక్టార్లో 73 వేల లేఆఫ్‌లు జరగ్గా ఇండియాలో 17 వేల మందికి పైగా సాఫ్ట్వేర్ సుధీర్లను ఇంటికి పంపారు. సిబ్బందిని ఇలా అర్ధంతరంగా ఇబ్బందిపెట్టిన సంస్థల జాబితాలో మెటా, అమేజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, నెట్‌ఫ్లిక్స్, సిస్కో, రోకు, హెచ్‌పీ తదితర కంపెనీలున్న సంగతి తెలిసిందే. గూగుల్ కూడా ఈ లిస్టులో చేరబోతోందని వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!