NTV Telugu Site icon

IND vs BAN: బంగ్లాపై టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం

Ind Won

Ind Won

బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో అత్యధికంగా మహ్మదుల్లా (41) పరుగులు చేశాడు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో మహ్మదుల్లా తప్ప.. మిగతా బ్యాటర్లు అందరు విఫలమయ్యారు. పర్వేజ్ హుస్సేన్ (16), లిటన్ దాస్ (14), షాంటో (11), మెహిదీ హసన్ (16), రిషద్ హుస్సేన్ (9), తంజీమ్ హసన్ (8) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి.. బంగ్లాదేశ్ బ్యాటర్లను వెంట వెంటనే పెవిలియన్కు పంపించారు. ఈ మ్యాచ్ లో నితిష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్ బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ పడగొట్టారు. వేసిన అందరు బౌలర్లు వికెట్ సంపాదించారు.

Read Also: Kerala High Court: ‘‘ముస్లిం యువతి షేక్ ల్యాండ్‌’’.. ఆరోపణలు చేసిన వ్యక్తికి షాక్..

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో నితీష్ కుమార్ రెడ్డి అత్యధికంగా (74) పరుగులు చేశాడు. 34 బంతుల్లో 74 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్‌లో రింకు సింగ్ కూడా అర్ధ సెంచరీతో (53) పరుగులతో రాణించాడు. అభిషేక్ శర్మ (15), సంజూ శాంసన్ (10), సూర్య కుమార్ యాదవ్ (8), హార్ధిక్ పాండ్యా (32), రియాన్ పరాగ్ (15), అర్ష్‌దీప్ సింగ్ (6) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. ముస్తాఫిజుర్ రెహమన్ 2 టస్కిన్ అహ్మద్ 2, తంజీమ్ హసన్ 2 వికెట్లు తీశారు. కాగా.. టీమిండియా ఈ విజయంతో 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ 20 మ్యాచ్ హైదరాబాద్‌లో ఈ నెల 12న జరుగనుంది.

Read Also: Delhi: రాహుల్, ఖర్గేను కలిసిన సీఎం హేమంత్, కల్పన దంపతులు