NTV Telugu Site icon

IND vs AFG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జైస్వాల్, సంజూకు నో ఛాన్స్..

Ind Vs Afg

Ind Vs Afg

IND vs AFG: భారత్-అఫ్ఘనిస్థాన్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్ మొహాలీ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా.. అటు యశస్వి జైస్వాల్‌కు విరామం ఇచ్చినట్లు భారత కెప్టెన్ రోహిత్ తెలిపాడు.

Hyderabad: నుమాయిష్ ఎగ్జిబిషన్లో హైదరాబాద్ సిటీ పోలీస్ స్టాల్ ప్రారంభం..

కాగా.. చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్ కు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అంతేకాకుండా.. అటు అఫ్ఘనిస్థాన్ జట్టులో కీలక ప్లేయర్ రషీద్ ఖాన్ కూడా ఆడటం లేదు. ఫిట్‌గా లేనందున మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు.. సొంతగడ్డపై భారత్‌ను సవాల్ చేయడం అఫ్ఘనిస్థాన్‌కు అంత సులభం కాదు. టీమిండియా చాలా బలంగా ఉంది. ఇప్పటి వరకుభారత్ పై అఫ్ఘనిస్థాన్‌ టీమ్‌ ఒక్క టీ20లో కూడా విజయం సాధించలేదు.

Himanta Biswa Sarma: “గతంలో నెహ్రూ చేసిన విధంగానే”.. రామమందిర విషయంలో కాంగ్రెస్ ప్రవర్తన

భారత ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ మరియు ముఖేష్ శర్మ.

అఫ్గానిస్తాన్‌ ప్లేయింగ్ ఎలెవన్:
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్‌), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హాక్ ఫారూఖీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్