NTV Telugu Site icon

IND vs AFG: సూపర్ -8పోరు.. మొదట బ్యాటింగ్ ఇండియాదే

Ind Vs Afg

Ind Vs Afg

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఇరుజట్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక్కో మార్పు చేశారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమిండియా అవకాశం కల్పించింది. మరోవైపు.. కరీం జనత్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్‌ను అఫ్ఘాన్ చేర్చింది. కాగా.. ఈ టోర్నీలో రోహిత్ సేన అద్భుతమైన ప్రదర్శన చూపిస్తూ.. సూపర్-8కి చేరుకుంది. అటు.. ఆఫ్ఘనిస్తాన్‌ను తేలికగా తీసుకోవడానికి లేదు. లీగ్ దశలో భారత్ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు.. రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్ఘనిస్తాన్ జట్టు హ్యాట్రిక్ విజయాలను అందుకోగా.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొంది. ఇండియా, అఫ్ఘనిస్తాన్ టీ20 హెడ్-టు-హెడ్ రికార్డ్ గురించి మాట్లాడితే.. ఇరు జట్లు మొత్తం 8 సార్లు ఢీకొన్నాయి. ఈ క్రమంలో.. భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఏడుసార్లు ఓడించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

New Suv Car : త్వరలో భారతీయ మార్కెట్లోకి ప్రముఖ కంపెనీల కూపే ఎస్ యూవీ కార్స్..

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

అఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్:
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్, ఫజ్కీన్-ఉల్.