Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ మహిళా క్రికెటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nooshin Al Khadeer Named Interim Head Coach for India Women’s Team: దాదాపుగా 5 నెలల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. జులై 9 నుంచి 22 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లు అన్ని మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం తాజాగా 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. తాజాగా హెడ్ కోచ్‌గా భారత మాజీ మహిళా క్రికెటర్‌ను ఎంపిక చేసింది.
2022 డిసెంబర్‌లో మహిళల జట్టు హెడ్ కోచ్ రమేశ్ పొవార్‌ని బీసీసీఐ బదిలి చేసింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి అతడిని పంపించేసింది. దీంతో అప్పటి నుంచి కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతోంది. 2023 ఏప్రిల్‌లో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పదవి కోసం ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్ తుషార్ అరోథే, దేశవాళీ దిగ్గజం అమోల్ ముజుందార్ వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు.
Also Read
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
Also Read: Nabha Natesh Latest Pics: నభా నటేష్ అందాల విందు.. ‘ఇస్మార్ట్’ పోరి గ్లామర్‌కు కుర్రాళ్లు ఫిదా!
రెండేండ్ల కాలానికి అమోల్ ముజుందార్ హెడ్ కోచ్‌గా రానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కమిటీ కూడా అతడిని ఫైనల్ చేసిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా భారత మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్‌ను తాత్కాలిక హెడ్ కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు.
బంగ్లాదేశ్ పర్యటనకు ముందే నూషిన్ అల్ ఖదీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదే ఆమెకు తొలి పరీక్ష కానుంది. బంగ్లాదేశ్ టూర్ తర్వాత భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఆ తర్వాత పలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ వేదికగా టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. అప్పటివరకు నూషిన్ ఉంటుందో లేదో చూడాలి.
Also Read: Praveen Kumar Car Accident: ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ భారత మాజీ ప్లేయర్!
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!