Ahmedabad: “విజయం దైవాజ్ఞ”.. ట్రోఫీతో అర్ధరాత్రి హనుమాన్ ఆలయానికి పరుగులు తీసిన సూర్య, కోచ్ గంభీర్ (వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmedabad: భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు కొట్టిన ఏకైక జట్టు టీమిండియా. భారత జట్టులో నిన్న అందరూ అదరగొట్టారు. బరిలోకి దిగిన బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించారు. ఈ కప్పులు కెప్టెన్ సూర్యకుమార్ అందుకోగానే హనుమాన్ ఆలయానికి పరుగులు తీశాడు. ఈ విజయం సాధించిన వెంటనే అర్ధరాత్రి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జయ్ షా కలిసి అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ కప్ ట్రోఫీతో వెళ్లి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ అనంతరం దేవుడి దయ వల్లే గెలిచామని సూర్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
READ MORE: Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయమే ఆ జట్టు కొంపముంచింది. బ్యాటింగ్ బరిలోకి దిగిన టీమిండియా చెలరేగింది. అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ అద్భుతంగా రాణించారు. గత కొన్ని మ్యాచుల్లో ఫామ్‌పై విమర్శలు వస్తున్నప్పటికీ ఫైనల్‌లో మాత్రం చెలరేగాడు అభీ.. కేవలం 21 బంతుల్లో 52 పరుగులు స్కోర్ చేశాడు. విమర్శకుల నోటికి తాళం వేశాడు. ఇక సంజూ 89 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు కేవలం 16 ఓవర్లలోనే రెండు వందల పరుగుల మార్క్ దాటింది. చివరి ఓవర్లలో శివం దూబే వేగంగా పరుగులు చేసి జట్టుకు మరింత బలం చేకూర్చాడు. మొత్తంగా భారత్ ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక పరుగులుగా నిలిచింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 159 పరుగుకే కుప్పకూలింది.
READ MORE: Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్
This will give big BURN to Liberals 🔥
Team India Captain Surya Kumar Yadav, offered prayers at the Hanuman Temple in Ahmedabad after winning the #T20WorldCup
Sanatan Shinning Bright 🚩🔥
#TeamIndia pic.twitter.com/HwkvhSfYm8
— Chota Don (@choga_don) March 8, 2026
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!