NTV Telugu Site icon

Team India Victory Parade : మేము మీ అందరితో కలిసి ఈ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాము.. రోహిత్ శర్మ..

Teamindia25

Teamindia25

Team India Victory Parade : 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించి రెండోసారి ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్‌ లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీనికి ముందు 2007 టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది. వన్డేల్లో 1983, 2011 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. ఈసారి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. టీమ్ ఇండియా జూలై 4న స్వదేశానికి తిరిగి వస్తుంది. టీమ్ ఇండియా ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఢిల్లీ చేరుకున్న భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది. అనంతరం భారత జట్టు ముంబైకి బయలుదేరుతుంది.

Kollu Ravindra: ఇసుక కొరత లేకుండా చూస్తాం.. బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు

దింతో భారత జట్టు షెడ్యూల్ రోజంతా చాలా బిజీగా ఉంటుంది. ముంబైలో భారత జట్టు కోసం విజయోత్సవ పరేడ్ కూడా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ (బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సెక్రటరీ జై షా ప్రకటించారు. జై షా దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను చేసాడు. ప్రపంచ ఛాంపియన్ టీం ఇండియా కోసం విజయ పరేడ్‌లో మాతో చేరండి., మాతో జరుపుకోవడానికి జూలై 4న సాయంత్రం 5:00 గంటల నుండి మెరైన్ డ్రైవ్, వాంఖడే స్టేడియం చేరుకోండి అంటూ తేదీని గుర్తుంచుకోండని పోస్టులో రాసుకొచ్చాడు.

Coin Stuck In Man’s Windpipe: వ్యక్తి శ్వాసనాళంలో 8 ఏళ్లుగా 25 పైసల నాణేం.. అరుదైన శస్త్రచికిత్స..

ఈ విజయ పరేడ్‌కు సంబంధించి రోహిత్ శర్మ కూడా ఎమోషనల్ ట్వీట్ చేశాడు. రోహిత్ తన పోస్ట్‌లో.. మేము మీ అందరితో కలిసి ఈ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాము. కాబట్టి ఈ విజయాన్ని జులై 4న సాయంత్రం 5:00 గంటల నుండి మెరైన్ డ్రైవ్, వాంఖడేలో విజయోత్సవ పరేడ్‌ తో జరుపుకుందాం అంటూ తెలిపాడు. ఇందులో భాగంగా నారిమన్ పాయింట్ నుండి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్ బస్సులో జట్టు రోడ్ షో నిర్వహించాలని భావిస్తున్నారు.