Coin Stuck In Man’s Windpipe: బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లోని శ్రీ సుందర్‌లాల్ హాస్పిటర్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 8 ఏళ్లుగా 40 ఏళ్ల వ్యక్తి శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన 25 పైసల నాణేన్ని తొలగించారు. కార్డియో-థొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ లఖోటియా మరియు ప్రొఫెసర్ ఎస్‌కె మాథుర్ నేతృత్వంలోని వైద్యుల బృందం మంగళవారం 20 నిమిషాల పాటు ఈ కీలక సర్జరీని చేసి, నాణేన్ని తొలగించారు.
పెద్ద వారిలో దగ్గు అనేది బలంగా ఉండటం వల్ల వస్తువులు శ్వాసనాళంలోకి ప్రవేశించడం చాలా అసాధారణమని, పిల్లల్లోనే ఇలాంటి కేసులు చూస్తామని డాక్టర్ లఖోటియా చెప్పారు. 8 ఏళ్లుగా ఒక బయటి వస్తువు శ్వాసనాళంలో ఉండిపోవడం అనేది చాలా అరుదు అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రాణాపాయం కలిగిస్తాయని, రోగులు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, న్యూమోనియా వంటివి ఎదుర్కోవచ్చని, ఊపిరితిత్తలు దెబ్బతినొచ్చని చెప్పారు. మొత్తం సర్జరీ విజయవంతంగా సాగిందని, రోగిని డిశ్చార్జ్ చేశామని వైద్యలు చెప్పారు.
ఇలాంటి శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ఖచ్చితత్వం చాలా అవసరమని, ఏ చిన్న లోపం జరిగినా ప్రాణాలకు ప్రమాదమని సర్జరీ కీలక పాత్ర వహించిన డాక్టర్ అమృత రథ్ చెప్పారు. శ్వాసనాళంలోని నాణేన్ని తొలగించేందుకు బ్రోంకోస్కోప్ ఉపయోగించినట్లు చెప్పారు. పెద్దవారిలో ఎవరైనా ఏదైనా వస్తువుని నోట్లో పెట్టుకుని నిద్రించినప్పుడు, మద్యం మత్తులో సెమి కాన్షియస్‌లో ఉంటే శ్వాసనాళంలోకి వస్తువులు చేరే అవకాశం ఉందని చెప్పారు.
Doctors at the Institute of #MedicalSciences, #BHU, have successfully performed a complex surgery to remove a 25 paise coin from a patient's main windpipe. The coin had been stuck in the trachea of this 40 year old patient since last 8 years. #MakingBHUSine pic.twitter.com/KPg51Fxv5C
— BHU Official (@bhupro) July 3, 2024