Site icon NTV Telugu

Bhuvneshwar Kumar: అయోమయంలో భువీ ఫ్యాన్స్.. టీమిండియాలో స్థానంలో లేనట్టేనా..?

Bhuvi

Bhuvi

టీమిండియా పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ చేసిన పని వల్ల ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. తన సోషల్‌ మీడియా అకౌంట్‌ బయోలో చేసిన మార్పుతో ఆయన ఫాలోవర్లను కన్ఫ్యూజన్‌లోకి తొసేశాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువీ 2012లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. పేస్‌ దళంలో కీలక సభ్యుడిగా జట్టుకు సేవలందించి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా ఈ సీమర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబరులో లాస్ట్ టైం భారత జట్టు తరఫున ఆడాడు.. ఇక, ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాంక్ట్ జాబితా నుంచి బీసీసీఐ భువనేశ్వర్ కుమార్ ను ఇటీవలే తొలగించింది.

Read Also: Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్‌పై పాలాభిషేకం చేసి చింపారు!

ఇక, వరుస వైఫల్యాలతో ఆసియా కప్‌ టీ20 టోర్నీ-2022, టీ20 ప్రపంచకప్‌-2022లో దారుణ ప్రదర్శన తర్వాత బీసీసీఐ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్‌ కుమార్‌.. దేశవాళీ క్రికెట్‌కు కూడా గత కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భువీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ బయోలో ఇండియన్‌ క్రికెటర్‌ను ఇండియన్‌గా మార్చుకున్నాడు.. ఇది చూసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఫ్యాన్స్‌.. అయ్యో ఏంటీ భువీ! నువ్వు తిరిగి జట్టులోకి వస్తావు అనుకుంటే.. నీవ్వు ఇలా చేశావంటు భువీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Read Also: Viral Video: ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు పోజులిస్తుండగా జలపాతంలో జారిపడ్డాడు.. వీడియో వైరల్

అయితే, ఇదంతా చూస్తుంటే భువనేశ్వర్ కుమార్ బాగా హర్ట్‌ అయినట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడి జీవితంలో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజం.. నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి రావాలి.. ఇప్పుడే రిటైర్మెంట్‌ తీసుకోవద్దు ప్లీజ్‌ అంటూ భువీ ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. కాగా ఇన్‌స్టాలో ఇండియన్‌ క్రికెటర్‌ అన్న పదాలను తొలగించిన భువనేశ్వర్.. ట్విటర్‌లో మాత్రం వాటిని అలాగే కొనసాగించడం గమనార్హం. ఏదేమైనా ఈ సీనియర్‌ పేసర్‌ తను చేసిన పనికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

Exit mobile version